Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రోజంతా లాభాల్లో కొనసాగినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వచ్చిన అమ్మకాల ఒత్తిడితో చివరకు నష్టాల్లో ముగిశాయి. అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు ఉన్నప్పటికీ, లాభాల్ని నిలబెట్టుకోలేకపోయాయి.
Stock Market Sensational Updates
సెన్సెక్స్ ఉదయం సుమారు 140 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ఒక దశలో 83,850 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. కానీ మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు ఊపందుకోవడంతో 700 పాయింట్ల వరకు నష్టపోయి, 83,186 వద్ద కనిష్టానికి చేరింది. చివరకు 170 పాయింట్ల నష్టంతో 83,239 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా అదే బాటలో నడిచి, చివరకు 48 పాయింట్ల నష్టంతో 25,405 వద్ద ముగిసింది.
లాభాల్లో ముగిసిన షేర్లు:
బాష్
బ్లూస్టార్
360 వాన్ వ్యామ్
ఆయిల్ ఇండియా
ఛంబల్ ఫెర్టిలైజర్స్
నష్టపోయిన షేర్లు:
నైకా
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్
పీఎన్‌బీ
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
వేదాంత
నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 16 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 207 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది.
భారత రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే ₹85.31గా నమోదైంది.
పెట్టుబడిదారుల అమ్మకాలు, గ్లోబల్ ఆందోళనలు మార్కెట్‌పై ప్రభావం చూపించాయి. దీని వల్ల సూచీలు చివర్లో తిరిగి వెనక్కి తగ్గాయి.
Also Read : Stock Market Sensational : ఈరోజు నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..టాప్ 5 లో ఈ కంపెనీలు
