Stock Market Sensational : ఈ నెల 7 నుంచి జెఎస్డబ్ల్యు సిమెంట్స్ కు ఐపీఓ

నిధుల సమీకరణ లక్ష్యం రూ.4,000 కోట్లను ఈసారి రూ.3,600 కోట్లకు తగ్గించినట్టు తెలిసింది...

Hello Telugu - Stock Market Sensational

Hello Telugu - Stock Market Sensational

Stock Market : ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సంస్థ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ పబ్లిక్ ఇష్యూ (IPO) ఈ నెల 7వ తేదీన ప్రారంభమై, 11వ తేదీన ముగియనుంది. సంస్థ ముందుగా నిర్ణయించిన నిధుల సమీకరణ లక్ష్యం రూ.4,000 కోట్లను ఈసారి రూ.3,600 కోట్లకు తగ్గించినట్టు తెలిసింది.

Stock Market Updates

ఈ ఐపీఓలో భాగంగా, కంపెనీ రూ.1,600 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అదనంగా, రూ.2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుతం ఉన్న వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో విక్రయించనున్నారు. ఈ వివరాలు కంపెనీ సెబీకి సమర్పించిన రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్‌ (RHP) ద్వారా వెల్లడయ్యాయి.

ఓఎఫ్‌ఎస్‌ ద్వారా దిగ్గజ పెట్టుబడిదారులైన అపోలో మేనేజ్‌మెంట్ రూ.931.80 కోట్ల షేర్లు, సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ రూ.938.50 కోట్ల విలువైన వాటాలను, అలాగే ఎస్బీఐ రూ.129.70 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు వెల్లడించారు.

ఐపీఓకు సిద్ధమైన ఆర్సిల్‌

ఇతర వైపున, అవెన్యూ క్యాపిటల్ మద్దతుతో నడుస్తున్న అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్ (ఆర్సిల్‌) కూడా తన ప్రారంభ పబ్లిక్ ఇష్యూ కోసం కసరత్తులు మొదలుపెట్టింది. ఈ సంస్థ ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్‌ (DRHP) ను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.

డీఆర్‌హెచ్‌పీ ప్రకారం, ప్రస్తుతం ఉన్న ప్రమోటర్లు మరియు వాటాదారులు మొత్తం 10.54 కోట్ల ఈక్విటీ షేర్లను OFS రూపంలో విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Also Read : Today Gold Price : నిన్నటికి, ఈ రోజుకి 1500 పైగా పెరిగిన పసిడి ధరలు

Exit mobile version