Stock Market Growth : ఐటీ షేర్ల పై మదుపర్లు ఆసక్తితో లాభాల్లో దేశీయ సూచీలు

బ్యాంకింగ్ రంగం మాత్రం స్వల్ప నష్టాలను నమోదు చేసింది...

Hello Telugu - Stock Market Growth

Hello Telugu - Stock Market Growth

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు దేశీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. దీనికి తోడు ఐటీ షేర్లపై మదుపర్ల ఆసక్తి కారణంగా భారత స్టాక్ (Stock Market) సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే, బ్యాంకింగ్ రంగం మాత్రం స్వల్ప నష్టాలను నమోదు చేసింది.

Stock Market – సెన్సెక్స్, నిఫ్టీ ఎగసిన తీరు

గత శుక్రవారం 81,306 వద్ద ముగిసిన సెన్సెక్స్ సోమవారం ఉదయం 200 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. రోజంతా సానుకూలంగా కదలాడి, ఒక దశలో 500 పాయింట్ల వరకు ఎగసి 81,799 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో లాభాల స్వీకరణ ఒత్తిడితో కొంత వెనక్కి తగ్గినా, చివరకు 329 పాయింట్ల లాభంతో 81,635 వద్ద రోజును ముగించింది.

నిఫ్టీ కూడా అదే దారిలో నడిచి, 97 పాయింట్లు పెరిగి 24,967 వద్ద స్థిరపడింది.

లాభాల్లో ఐటీ, నష్టాల్లో ఫైనాన్స్

సెన్సెక్స్‌లో వొడాఫోన్ ఐడియా, జుబిలెంట్ ఫుడ్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, జైడస్ లైఫ్, ఇన్ఫోసిస్‌ షేర్లు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ఏంజెల్ వన్, ఎల్‌అండ్‌టి ఫైనాన్స్, సీడీఎస్‌ఎల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు నష్టాల బాట పట్టాయి.

నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 71 పాయింట్లు పెరిగింది. అయితే, బ్యాంక్ నిఫ్టీ 10 పాయింట్లు తగ్గింది.

రూపాయి స్థిర స్థితి

విదేశీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ స్వల్ప మార్పులతో డాలర్‌కు 87.58 వద్ద నిలిచింది.

Also Read : GST Reforms Interesting : సెప్టెంబర్ 22 నాటికి జీఎస్టీ స్లాబులపై కీలక మార్పులు

Exit mobile version