Stock Market Growth : ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతతో లాభాల్లో స్టాక్ మార్కెట్

బుధవారం లాభాలను నమోదు చేసిన సూచీలు గురువారం కూడా అదే జోరును కొనసాగించాయి.

Hello Telugu - Stock Market Growth

Hello Telugu - Stock Market Growth

Stock Market : అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఊహించినట్టుగానే వడ్డీ రేట్లలో కోత విధించడంతో పాటు భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై వచ్చిన సానుకూల వార్తలు దేశీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి. ఇప్పటికే మంగళవారం, బుధవారం లాభాలను నమోదు చేసిన సూచీలు గురువారం కూడా అదే జోరును కొనసాగించాయి.

Stock Market – సెన్సెక్స్ – నిఫ్టీ బలమైన ముగింపు

బుధవారం 82,693 వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం ఉదయం 400 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదిలి 82,704 – 83,141 శ్రేణిలో ఊగిసలాడింది. చివరకు 320 పాయింట్లు ఎగబాకి 83,013 వద్ద స్థిరపడింది. దీతో చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ మళ్లీ 83,000 మార్క్ పైకి చేరుకుంది.
నిఫ్టీ కూడా అదే బాటలో కదిలి 93 పాయింట్ల లాభంతో 25,423 వద్ద రోజు ముగిసింది.

లాభపడ్డ – నష్టపడ్డ షేర్లు

ఇతర సూచీలు

నిపుణుల విశ్లేషణ

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ కోత పెట్టుబడిదారులలో కొత్త ఉత్సాహం తెచ్చిందని, అలాగే భారత్–అమెరికా వాణిజ్య చర్చలు విజయవంతంగా ముందుకు సాగుతాయనే అంచనాలు మార్కెట్లకు (Stock Market) మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.

Also Read : Today Gold Price : నేడు గందరగోళంగా మారిన పసిడి ధరలు

Exit mobile version