Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల ఒత్తిడి కొనసాగుతోంది. సోమవారం భారీ నష్టాలతో ముగిసిన సూచీలు మంగళవారం కూడా అదే బాటలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, ఐటీ రంగంలో అమ్మకాలు, రూపాయి బలహీనత మార్కెట్‌పై (Stock Market) ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 10:10 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 82,024 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 25,157 వద్ద కొనసాగుతోంది.
Stock Market – లాభాల్లో ఉన్న షేర్లు
- అశోక్ లేలాండ్
- మారుతీ సుజుకీ
- వోడాఫోన్ ఐడియా
- ఎమ్ అండ్ ఎమ్
- టీవీఎస్ మోటార్స్
నష్టాల్లో ఉన్న షేర్లు
- ఎంఫసిస్
- ట్రెంట్
- అదానీ ఎనర్జీ
- ఆసియన్ పెయింట్స్
- నవుమా వెల్త్
ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 207 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 39 పాయింట్ల లాభంలో ఉంది. విదేశీ మారకంలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 88.56గా నమోదైంది.
Also Read : RBI Important Update : రెపో రేటుపై కీలక నిర్ణయం తీసుకోబోతున్న ఆర్బీఐ
