అక్టోబరు 12 నుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

16న గరుడ వాహనం, 17న పుష్పక విమానం,

hellotelugu-TTDNavaratriBrahmotsavam

తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్ర మానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక‌సారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యా మాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజా రోహణం, పెద్ద రథం, ధ్వజా వ‌రోహణం ఉండవు. ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహన సేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైశిష్ట్యం ఇలా ఉంది.
.
అక్టోబరు 11వ తేదీన‌ అంకురార్పణం రాత్రి 7 నుండి 9 గంటల వరకు, 12న‌ బంగారు తిరుచ్చి ఉత్సవం ఉదయం 9 గంటలకు, పెద్దశేష వాహనం రాత్రి 7 గంటలకు, 13న‌ చిన్నశేష వాహనం ఉదయం 8 గంటలకు, హంస వాహనం రాత్రి 7 గంటలకు, 14న‌ సింహ వాహనం ఉదయం 8 గంటలకు ముత్యపు పందిరి వాహనం రాత్రి 7 గంటలకు, 15న కల్పవృక్ష వాహనం ఉదయం 8 గంటలకు సర్వ భూపాల వాహనం రాత్రి 7 గంటలకు జ‌రుగుతుంది. అక్టోబరు 16న‌ మోహినీ అవతారం ఉదయం 8 గంటలకు గరుడ వాహనం సాయంత్రం 6.30 గంటలకు, 17న హనుమంత వాహనం ఉదయం 8 గంటలకు పుష్పక విమానం సాయంత్రం 4 గంటలకు ,గజ వాహనం – రాత్రి 7 గంటలకు , 18న‌ సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు, చంద్రప్రభ వాహనం రాత్రి 7 గంటలకు, 19న స్వర్ణరథం ఉదయం 7 గంటలకు,
అశ్వ వాహనం రాత్రి 7 గంటలకు, 20న చక్రస్నానం ఉదయం 6 గంటలకు జ‌రుగుతుంద‌ని టీటీడీ తెలిపింది.

Exit mobile version