Minister Sridhar Babu Strong Comments : ఆరు గ్యారెంటీల అమ‌లుపై ఫోక‌స్ – శ్రీ‌ధ‌ర్ బాబు

కాంగ్రెస్ జ‌న‌హిత పాద‌యాత్ర‌లో మంత్రి

Hello Telugu - Minister Sridhar Babu Strong Comments

Hello Telugu - Minister Sridhar Babu Strong Comments

Sridhar Babu : రంగారెడ్డి జిల్లా – మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు ఆరు గ్యారెంటీల అమ‌లుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము ఇచ్చిన మాట ప్ర‌కారం అమ‌లు చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన జ‌న‌హిత పాద‌యాత్ర‌లో శ్రీ‌ధ‌ర్ బాబుతో (Sridhar Babu) పాటు తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పాద‌యాత్ర‌ను ఉద్దేశించి శ్రీ‌ధ‌ర్ బాబు ప్ర‌సంగించారు.

Minister Sridhar Babu Key Comments

‘జనహిత పాదయాత్ర’ అనేది ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను అర్థం చేసుకుని, పాలన నిజంగా వారి ఇంటి గుమ్మాలకు చేరేలా చూసుకోవడానికి మార్గంగా ఉప‌యోగ ప‌డుతుంద‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్ర‌జా పాల‌న‌తో ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు. ప్రజలే ముందుండే పరిపాలనకు కట్టుబడి ఉన్నామని అన్నారు. మీనాక్షి న‌ట‌రాజ‌న్, మ‌హేష్ కుమార్ గౌడ్ తో పాటు తాను కూడా మీ కోసం ముందుకు వ‌చ్చామ‌ని స్ప‌ష్టం చేశారు. పౌరులతో నేరుగా మమేకం కావడానికి, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడానికి, ప్రభుత్వ ప్రయత్నాలు నిజంగా అట్టడుగు వర్గాలకు చేరుతున్నాయని నిర్ధారించు కోవడానికి పరిగిలో ఈ జ‌న‌హిత పాద‌యాత్ర ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

ఇది ఎన్నికల కోసం జ‌రిగే కార్య‌క్ర‌మం కాద‌న్నారు. కానీ ప్రజా సంభాషణ అనేది నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియ అని పేర్కొన్నారు శ్రీ‌ధ‌ర్ బాబు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి యాత్ర చేపడతామని కొందరు ప్రశ్నించవచ్చు. కానీ మాకు, ప్రజలతో కనెక్ట్ అవ్వడం అనేది ఒక బాధ్యత, వ్యూహం కాద‌న్నారు.

Also Read : Tirumala Darshanam Easy : నేటి నుంచి మరింత సులభంగా శ్రీవారి దర్శనం

Exit mobile version