క్రికెట్ అభిమానుల‌కు శ్రీ‌లంక బోర్డు ఖుష్ క‌బ‌ర్

భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ఉచిత ప్ర‌వేశం

hellotelugu-SrilankaBoard

కొలంబో : శ్రీ‌లంక క్రికెట్ బోర్డు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు త‌మ దేశంలోని క్రికెట్ ప్రేమికుల‌కు తీపి క‌బురు చెప్పింది. తాజాగా భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం శ్రీ‌లంక‌లో టెస్టు సీరీస్ ఆడనుంది.
సీరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలోనూ, రెండో మ్యాచ్ ఆగస్టు 23-27 మధ్య కొలంబోలోని ఎస్‌ఎస్‌సి లోనూ జరుగుతాయి. శ్రీలంకలో టెస్ట్ క్రికెట్‌కు సాధారణంగా ప్రేక్షకుల ఆదరణ తక్కువగా ఉంటుంది. గతంలో భారత జట్లు కూడా ఖాళీ స్టేడియాల సాక్షిగానే ఆడాల్సి వచ్చింది. ఆగస్టు 15న గాలేలో ప్రారంభం కానున్న భారత్-శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ సమయంలో క్రికెట్ అభిమానులకు స్టేడియంలోకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. తద్వారా ప్రపంచ స్థాయి టెస్ట్ క్రికెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అద్భుతమైన అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నామని పేర్కొంది బోర్డు.

మొదటి మ్యాచ్ గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలోనూ, రెండో మ్యాచ్ ఆగస్టు 23-27 మధ్య కొలంబోలోని ఎస్‌ఎస్‌సి లోనూ జరుగుతాయి.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, భారత్-శ్రీలంక మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఉత్సాహాన్ని ఆస్వాదించాల్సిందిగా దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు, ఔత్సాహిక యువ క్రికెటర్లు, కుటుంబాలు , క్రీడాభిమానులను శ్రీలంక క్రికెట్ సాదరంగా ఆహ్వానిస్తోంది అని ఆ ప్రకటనలో పేర్కొంది శ్రీ‌లంక క్రికెట్ బోర్డు. శ్రీలంకలో టెస్ట్ క్రికెట్‌కు సాధారణంగా ప్రేక్షకుల ఆదరణ తక్కువగా ఉండ‌డంపై త‌గ్గించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. కోల్‌కతా, చెన్నై, ముంబై , బెంగళూరు వంటి కొన్ని భారతీయ నగరాలు మినహా, ఉపఖండంలో ‘రెడ్-బాల్’ క్రికెట్ (టెస్ట్ క్రికెట్)కు ప్రేక్షకుల రాక పరంగా పెద్దగా ఆదరణ లభించలేదు.

Exit mobile version