Sri Kalyana Venkateswara Interesting Celebration : ఘ‌ణంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి పార్వేట ఉత్స‌వం

తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు

Hello Telugu - Sri Kalyana Venkateswara Interesting Celebration

Hello Telugu - Sri Kalyana Venkateswara Interesting Celebration

Sri Kalyana Venkateswara : తిరుప‌తి – తిరుప‌తి లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి (Sri Kalyana Venkateswara) పార్వేట ఉత్సవాన్ని శ్రీవారి మెట్టు సమీపంలో అత్యంత‌ వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవ మూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్ట శిక్షణ కోసం స్వామి వారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామి వారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకు వ‌చ్చారు.

Sri Kalyana Venkateswara Parveta Ustavam

సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి పార్వేట ఉత్స‌వ కార్య‌క్ర‌మానికి. ఈ స‌మ‌యంలో స్వామి వారిని ద‌ర్శించుకుంటే పుణ్యం ద‌క్కుతుంద‌ని, ఉన్న స‌మ‌స్య‌లంటూ ఉండ‌వ‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం జేఈవో వీర‌బ్ర‌హ్మం ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ఏర్పాట్లు చేసింది.

ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈఓ శ్రీ గోపినాథ్, తదితర అధికారులు, శ్రీవారి సేవకులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Also Read : TTD Devotees Shocking Allegations : శ్రీవాణి భక్తుల ఆరోపణ‌లు పూర్తిగా అబ‌ద్దం

Exit mobile version