జోగులాంబ రైల్వే స్టేష‌న్ 95 శాతం ప‌నులు పూర్తి

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి

hellotelugu-GKishanReddy

జోగులాంబ గ‌ద్వాల జిల్లా : జోగులాంబ గద్వాల్ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి; 95% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆయన గద్వాల్-జోగులాంబ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. హైదరాబాద్: గద్వాల్-జోగులాంబ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులలో 95 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. ఆయన స్టేషన్‌ను సందర్శించి, జరుగుతున్న పనులను పరిశీలించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడారు . ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్టేషన్లను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నామ‌ని తెలిపారు. మహబూబ్‌నగర్, వికారాబాద్, తాండూరు, హైదరాబాద్ (నాంపల్లి), సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి వంటి కీలక రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్లాట్‌ఫారమ్‌లు, వెయిటింగ్ హాల్స్, ఎస్కలేటర్లు , అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రం సమీపంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్‌ను, స్థానిక ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్‌తో తీర్చి దిద్దుతుండటం దీని ప్రత్యేకత అని అన్నారు. రూ. 6.7 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఆధునీకరణ పనులలో ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు జి. కిష‌న్ రెడ్డి. మిగిలిన పనులు పూర్తయిన తర్వాత, ఈ స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారని అన్నారు.

Exit mobile version