తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల , శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు జూలై 23, 24 తేదీల్లో మెరిట్ ఆధారంగా ఆఫ్‌లైన్ విధానంలో స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయని అభ్యర్థులకు ప్రవేశానికి అవకాశం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.
స్పాట్ అడ్మిషన్లకు టీటీడీ ఉద్యోగుల పిల్లలు, టీటీడీ ఎస్‌వీ బాలమందిర్ విద్యార్థులు, మొదటి నుంచి ఆరో దశ కౌన్సెలింగ్ వరకు హాజరు కాలేక పోయిన అభ్యర్థులు, తిరుపతి స్థానికులు, స్థానికేతర అభ్యర్థులు అర్హులు అర్హులని పేర్కొంది. ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. జూలై 23వ తేదీ ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు 550–600 మార్కులు సాధించిన అభ్యర్థులకు, మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు: 500–549 మార్కులు సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపింది.
జూలై 24వ తేదీ ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు: 450–499 మార్కులు సాధించిన అభ్యర్థులు, మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు: 400–449 మార్కులు సాధించిన అభ్యర్థులు తమ ఒరిజినల్ ధృవపత్రాలతో విద్యార్థులు హాజరు కావాలని కోరింది టీటీడీ. సంబంధిత పత్రాలతో నిర్ణీత తేదీలు, సమయాలకు సంబంధిత కళాశాలలకు హాజరై స్పాట్ అడ్మిషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.
