AP Teachers Special Training Interesting : ఏపీలో నూత‌న టీచ‌ర్ల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ

అక్టోబ‌ర్ 10 వ‌ర‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆదేశం

Hello Telugu - AP Teachers Special Training Interesting

Hello Telugu - AP Teachers Special Training Interesting

AP Teachers : అమ‌రావ‌తి : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ 2025 (AP Teachers) నియామక ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ మేర‌కు ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు అంద జేసింది ప్ర‌భుత్వం. తాజాగా ఎంపికయిన ఉపాధ్యాయులకు నేటి నుంచి నుంచి 10 వరకు శిక్షణ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరందరికీ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు గాను ఈనెల 9, 10 తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్ నిర్వ‌హించాల‌ని పేర్కొంది ఉత్త‌ర్వుల‌లో. కౌన్సెలింగ్‌ అనంతరం ఎంపికైన కొత్త టీచర్లకు అకడమిక్‌ కేలండర్, హ్యాండ్‌బుక్‌ తదితర మెటీరియల్‌ను అందజేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

AP Teachers Special Training Updates

ఇదిలా ఉండ‌గా మరో విడతగా ఎంపికైన టీచర్లకు ఏప్రిల్‌ 25 నుంచి మే 5 వరకు శిక్షణ తరగతులు ఉంటాయని స్ప‌ష్టం చేసింది విద్యా శాఖ‌. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు, కానిస్టేబుళ్లుగా పని చేస్తూ డీఎస్సీ టీచర్‌ పోస్టులకి ఎంపికైన అభ్యర్ధులు శిక్షణకు హాజరు కావడానికి ఆయా విభాగాలు సెలవులు మంజూరు చేయడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు పోస్టింగ్‌ ఇచ్చినప్పటి నుంచే ప్రస్తుత విధుల నుంచి రిలీవ్‌ చేస్తామని ఆయా విభాగాలు చెబుతున్నాయని కానీ స్పందించడం లేదంటూ వాపోతున్నారు. ఇంకో వైపు విద్యాశాఖ మాత్రం తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయ‌డంతో ల‌బోదిబోమంటున్నారు పంతుళ్లు.

Also Read : KL Rahul Interesting Innings : తొలి టెస్టులో స‌త్తా చాటిన కేఎల్ రాహుల్

Exit mobile version