న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన జీవిత కాలంలో అరుదైన ఘనతను సాధించారు. ఆయన ప్రజా సేవలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన చేసిన సేవలను , కార్యక్రమాలను పురస్కరించుకుని బీజేపీ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మోదీ ప్రజా సేవకు గుర్తుగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 13 ఏళ్ల పదవీ కాలంతో పాటు ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు దారితీశాయని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని, దేశ అభివృద్ధికి ఆయన అందించిన సహకారాన్ని ప్రజలకు తెలియ జేసేందుకు దేశవ్యాప్తంగా “సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు తెలిపారు.
ఈ ప్రచారంలో భాగంగా, సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగించి, నరేంద్ర మోదీకి తమ ఆశీస్సులు అందించాలని మాధవ్ కోరారు. ప్రధానమంత్రి ఆరోగ్యం, దీర్ఘాయువు, బలం , నిరంతర విజయాల కోసం ప్రజలు ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ 13 ఏళ్ల పదవీకాలం, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయన సేవలు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు దారి తీశాయని మాధవ్ నొక్కి చెప్పారు. ఈ విజయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17న తమ కుటుంబ సభ్యులతో పాటు తమ పరిసరాల్లోని ప్రజలు కూడా ఈ ‘ఆశీర్వాద దీపం’ వెలిగించేలా చూడాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పార్టీ కార్యకర్తలను కోరారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన ఆరోగ్యం , దీర్ఘాయువు కోసం ప్రజలు సమిష్టిగా ప్రార్థించేలా ఈ దీపోత్సవ కార్యక్రమం గుర్తు చేస్తుందని మాధవ్ పేర్కొన్నారు.
