బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మహిళల కోసం ప్రత్యేక ‘రుతుతారేస ఆరోగ్య విధానాన్ని ప్రవేవ పెట్టనున్నట్లు వెల్లడించింది. దేశంలోనే ఇటువంటి విధానం రావడం ఇదే మొదటిసారి అని భావిస్తున్నారు. ఇది ప్రధానంగా మహిళల్లో రుతువిరతి సంబంధిత సమస్యలపై దృష్టి సారిస్తుంది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా వెల్లడించారు కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి. ఖాదర్ తెలిపారు. ‘రుతుతారే’ అని పేరు పెట్టబడిన ఈ విధానం దేశంలోనే మొట్టమొదటిది కానుందని, ఇది ప్రధానంగా మహిళల్లో రుతువిరతి సంబంధిత సమస్యలపై దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ఒక ప్రత్యేక ఆరోగ్య విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం మనకు ఒక సాధారణ ఆరోగ్య విధానం మాత్రమే ఉంది; రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య విధానం లేదు.
మహిళలకు సంబంధించిన అన్ని ఆరోగ్య కార్యక్రమాలు సాధారణ ఆరోగ్య విధానం పరిధిలోకి రావడం వల్ల, మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత బహుశా తగ్గి ఉండవచ్చు అని ఖాదర్ అన్నారు. మేము వీటన్నింటిపై చర్చించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ‘రుతుతారే’ అనే పేరుతో మహిళా ఆరోగ్య విధానాన్ని కర్ణాటకలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వైద్యుల సలహాలు , సమాచారం ప్రకారం రుతువిరతి సమయంలో మహిళలు అనేక మానసిక , ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని, ఈ దశలో వారి జీవనశైలిని నిర్వహించు కోవడంలో , మానసిక ఒత్తిడిని తగ్గించు కోవడంలో వారికి సహాయ పడటమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఇది మందుల వాడకం లేకుండా నివారణ చర్యలపై దృష్టి సారిస్తుందన్నారు మంత్రి ఖాదర్. దేశంలోనే మొట్ట మొదటిదైన ఈ విధానాన్ని రూపొందించడంలో ఆరోగ్య శాఖకు సహాయ పడటానికి ,సమాచారాన్ని పంచుకోవడానికి తాము డాక్టర్ జ్యోత్స్న మిర్లే (కన్సల్టెంట్, వంధ్యత్వ నివారణ నిపుణురాలు) , అధికారులతో కూడిన ఒక విధాన కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
