Jagadish Reddy Fired on Congress Govt : గాడి త‌ప్పిన కాంగ్రెస్ పాల‌న : జ‌గదీష్ రెడ్డి

పంట‌లు న‌ష్ట పోయిన రైతుల‌ను ఆదుకోవాలి

Hello Telugu - Jagadish Reddy Fired on Congress Govt

Hello Telugu - Jagadish Reddy Fired on Congress Govt

Jagadish Reddy : హైద‌రాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న గాడి త‌ప్పింద‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి. మొంథా తుపాను కార‌ణంగా పెద్ద ఎత్తున కురిసిన వర్షాల కార‌ణంగా చేతికొచ్చిన పంట‌లు నాశ‌నం అయ్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌ హయాంలో లేని పంట కొనుగోళ్ల సమస్య ఇప్పుడు ఎందుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించారు. నల్గొండ జిల్లా అర్జాలబావి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జ‌రిగింద‌న్నారు. సీఎం, మంత్రులు ఢిల్లీ, ముంబై విహార యాత్రలు మానేసి రైతుల కష్టాలు పట్టించు కోవాల‌ని డిమాండ్ చేశారు జ‌గ‌దీశ్ రెడ్డి (Jagadish Reddy). యూరియా బస్తాలు ఇవ్వకుండా మొన్నటి దాకా బాధపెట్టార‌ని, ఇప్పుడు పండిన పంట కొనకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Ex Minister Jagadish Reddy Slams Congress Govt

కాంగ్రెస్ నాయకులు మిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకుని పంట కొనడంలేదని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి. ప్రభుత్వం మొలకొచ్చిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంత‌రం జ‌గ‌దీశ్ రెడ్డి జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌ల సంద‌ర్బంగా ప్ర‌చారం చేప‌ట్టారు. 420 హామీల‌ను ఇచ్చిన స‌ర్కార్ వాటి గురించి ఊస‌త్త‌డం మ‌రిచి పోయింద‌న్నారు. బాద్య‌త క‌లిగిన మంత్రులు సోయి త‌ప్పి మాట్లాడుతున్నార‌ని, అస‌లు రాష్ట్రంలో పాల‌న అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు జ‌గ‌దీశ్ రెడ్డి. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారని, ఇప్ప‌టికే స‌ర్వేల‌న్నీ త‌మ పార్టీ గెలుస్తుంద‌ని ప్ర‌క‌టించాయ‌ని, దీంతో సీఎం రేవంత్ రెడ్డి నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారంటూ మండిప‌డ్డారు.

Also Read : KK Survey Results Sensational : జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో గులాబీదే హ‌వా

Exit mobile version