Speaker Ayyannapatrudu Fired YSRCP : ఉద్యోగులు స‌రే ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు ఉండ‌వా..?

నిప్పులు చెరిగిన స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు ఫైర్

Hello Telugu - Speaker Ayyannapatrudu Fired YSRCP

Hello Telugu - Speaker Ayyannapatrudu Fired YSRCP

Speaker Ayyannapatrudu : తిరుపతి : ఏదైనా త‌ప్పు చేస్తే చిరు ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, మ‌రి ప్ర‌జ‌లు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాక పోతే చ‌ర్య‌లు ఎందుకు ఉండ‌వ‌ని ప్ర‌శ్నించారు ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు (Speaker Ayyannapatrudu). ఆదివారం తిరుపతిలో మహిళా సాధికారత జాతీయ సదస్సు ప్రారంభ‌మైంది. లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా , ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, మంత్రులు స‌త్య ప్ర‌సాద్, ప‌య్యావుల కేశ‌వ్ , పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ గౌరు చరిత రెడ్డి , డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు , దేశంలోని అన్ని రాష్ట్రాల కమిటీల చైర్మన్‌లు, సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Speaker Ayyannapatrudu Slams Escaping MLA’s

ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోని మహిళా ప్రజా ప్రతినిధులందరినీ పవిత్ర క్షేత్రం తిరుపతిలో ఒకే వేదికపై సమావేశ పరిచే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ స్వాతంత్ర‌ సమరం లోనూ, రాజ్యాంగ నిర్మాణం లోనూ మహిళలు ముందంజలో ఉన్నారని అన్నారు. నేడు రాజకీయాల నుంచి సమాజాభివృద్ధి వరకు అన్ని రంగాల్లో ముద్ర వేశారని చెప్పారు. అయినా మహిళా వాణి మరింత బలంగా వినిపించాలనే అవసరం ఉందన్నారు.

Also Read : Vijay Interesting Comments : మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ప్ర‌యారిటీ : విజ‌య్

Exit mobile version