లైంగిక వేధింపుల కేసులో ప్రొఫెస‌ర్స్ అరె్స్ట్

వెల్ల‌డించిన ఎస్పీ సుబ్బారాయుడు

hellotelugu-SPSubbaraidu

తిరుప‌తి : తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో 2025–2026 విద్యా సంవత్సరంలో బీఎడ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 27 ఏళ్ల యువతి పై జరిగిన సంఘటనపై తిరుపతి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బాధిత విద్యార్థిని 25 వ తేదీ జూన్ లో యూనివర్సిటీలో చేరింది. అప్ప‌టి నుంచి యూనివ‌ర్శిటీలోనే ఉంటూ చ‌దువుకుంటోంది. ఇదే యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మణ్ కుమార్ తన పదవిని దుర్వినియోగం చేస్తూ, విద్యార్థినిని ప్రలోభపెట్టి, ఆమె ఇష్టానికి విరుద్ధంగా తన ఆఫీస్ గదిలో బలవంతంగా లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఘటన సమయంలో అదే విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ ఏ. శేఖర్ రెడ్డి, సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీశాడు. ఈ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని బెదిరిస్తూ బాధితురాలిని శారీరకంగా, మానసికంగా వేధించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు తేలింది విచార‌ణ‌లో. ఈ ఘటనపై నేషనల్ సంస్కృత యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారి ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.183/2025, U/S 75(1), 77, 79, 351(2) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి ఎస్డీపీఓ శ్రీ భక్తవత్సలం దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ వి. మురళీమోహన్ రావు ఆధ్వర్యంలోని బృందం బాధితురాలి స్వగ్రామానికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఘటనా స్థలం పరిశీలన, సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, బాధితురాలి వివరణ ఆధారంగా కేసులో అదనంగా సెక్షన్లు 63, 68 BNS చేర్చబడింది. కేసు దర్యాప్తు చేసి ముద్దాయిలుగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్ కుమార్ , డాక్టర్ ఏ. శేఖర్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version