Special Trains : దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటికే నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల (Special Trains) సేవలను మరికొన్ని నెలలు కొనసాగించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆగస్టుతో ముగియనున్న గడువును నవంబర్ 24 వరకు పొడిగించారు.
Special Trains – ప్రత్యేక రైళ్ల వివరాలు
- తిరుపతి – సాయినగర్ షిర్డీ మధ్య నడిచే (07637/07638) నెంబర్ గల ప్రత్యేక రైలు సేవలు నవంబర్ 24 వరకు కొనసాగుతాయి.
- నరసాపురం – తిరువణ్ణామలై మధ్య నడిచే (07219/07220) నెంబర్ గల ప్రత్యేక రైళ్లు కూడా నవంబర్ 24 వరకు పొడిగించబడ్డాయి.
- హైదరాబాద్ – కన్యాకుమారి (07230/07229), కాచిగూడ – మధురై (07191/07192) ప్రత్యేక రైళ్లు కూడా అదే తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
- అదనంగా, హైదరాబాద్ – కొల్లాం మధ్య (07193/07194) నెంబర్ గల ప్రత్యేక రైలు తిరుపతి, రేణిగుంట మార్గంగా నవంబర్ చివరి వరకు నడుస్తుందని అధికారులు తెలిపారు.
ప్రయాణికులకు ఉపశమనం
ఈ నిర్ణయంతో పండుగల సమయంలో సొంత ఊళ్లకు వెళ్లే వారు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులు సులభంగా ప్రయాణించే అవకాశం కలుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Also Read : Zomato Price Growth : మరోసారి ప్లాట్ఫారం ఫీజును 20 శాతం పెంచిన జొమాటో
