Sourav Ganguly : కోల్ కతా : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ మెగా టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య చోటు చేసుకున్న హ్యాండ్ షేక్ వివాదం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రీడా రంగాలలో చర్చనీయాంశంగా మారింది. పహల్గామ్ దాడికి నిరసిస్తూ తాము పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయడం లేదని ప్రకటించాడు ఇండియా జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. ఇది తాను తీసుకున్న నిర్ణయం కాదన్నాడు. ఇప్పటికే భారత ప్రభుత్వం, బీసీసీఐ ఆదేశాల మేరకు తమ యాజమాన్యం కరచాలనానికి దూరంగా ఉన్నామన్నాడు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( పీసీబీ) భారత్ పై, అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని లేక పోతే యూఏఈతో తాము ఆడబోమంటూ ప్రకటించింది పీసీబీ.
Sourav Ganguly Slams Pakistan Cricket Board
ఈ మొత్తం వ్యవహారంపై ఏసీసీ స్పందించింది. ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇది జరిగిందని, అంపైర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ తరుణంలో హ్యాండ్ షేక్ వివాదంపై తీవ్రంగా స్పందించాడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అలియాస్ దాదా. భారత జట్టుతో పోటీ పడే సత్తా, శక్తి పాకిస్తాన్ జట్టుకు లేదన్నాడు. తాను ఈ రెండు జట్లు తల పడుతుంటే టీవీ చూడనని చెప్పాడు. ఇతర జట్లతో ఆడుతుంటే మ్యాచ్ లు చూస్తానని పేర్కొన్నాడు. దాయాది పాకిస్తాన్ ను, పీసీబీని ఎగతాళి చేశాడు గంగూలీ. ఆటలు కొనసాగుతూనే ఉంటాయని, కానీ ముందుగా మారాల్సింది ఉగ్రవాదం అని స్పష్టం చేశాడు. ఇంకెంత కాలం ఇలా దాడులకు పాల్పడుతూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తారంటూ ప్రశ్నించాడు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నాడు దాదా. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : PCB Shocking Comments on Hand Shake : కరచాలనం వివాదం పాకిస్తాన్ బోర్డు ఆగ్రహం
