PCB Shocking Comments on Hand Shake : క‌ర‌చాల‌నం వివాదం పాకిస్తాన్ బోర్డు ఆగ్ర‌హం

ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు భార‌త్ పై ఫిర్యాదు

Hello Telugu - PCB Shocking Comments on Hand Shake Issue

Hello Telugu - PCB Shocking Comments on Hand Shake Issue

PCB : దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీలో భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య చోటు చేసుకున్న క‌ర‌చాల‌నం వివాదం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు పహ‌ల్గామ్ లో 26 మంది ప్ర‌యాణీకుల‌పై కాల్పుల‌కు తెగ‌బడ్డారు. ఈ ఘ‌ట‌న‌తో భార‌త్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆపై ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో దాడుల‌కు దిగింది. చివ‌ర‌కు ఆ దేశం కాళ్ల బేరానికి రావ‌డంతో యుద్దాన్ని నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఆసియా క‌ప్ లో భాగంగా పాకిస్తాన్ తో ఇండియా ఆడాల్సి ఉంది. కానీ ఆ దేశం వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు కేంద్ర ప్ర‌భుత్వం. త‌మ‌కు ఆట కంటే ఆటగాళ్ల భ‌ద్ర‌త ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

PCB Shocking Comments on Hand Shake Issue

ఈ మేర‌కు బీసీసీఐ అనుమ‌తి కోరినా ఒప్పుకునేది లేదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది. దీంతో పాకిస్తాన్ లో కాకుండా త‌ట‌స్థ వేదిక‌ల మీద ఆడేందుకు తాము సిద్దంగా ఉన్నామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్ర‌తిపాదించింది. ఇదిలా ఉండ‌గా చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు పాకిస్తాన్, ఇండియా జ‌ట్లు పోటీ ప‌డ్డాయి. భార‌త జ‌ట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ సంద‌ర్బంగా ఆట‌లో భాగంగా ఇరు జ‌ట్ల ఆటగాళ్లు క‌ర‌చాల‌నం చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. కానీ ఇండియా ఆట‌గాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వ‌లేదు పాక్ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌కు. దీనిపై జ‌ట్టు అంపైర్ పై ఆసియా క్రికెట్ బోర్డు కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది పీసీబీ. దీనిపై క్లారిటీ ఇచ్చింది ఏసీసీ. ఈ విష‌యం అంపైర్ కు ముందే చెప్పామ‌ని, హ్యాండ్ షేక్ వివాదంతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్.

Also Read : BCCI Clear Update : హ్యాండ్ షేక్ వివాదంపై బీసీసీఐ కామెంట్స్

Exit mobile version