Somireddy : నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ పార్టీ నేతలపై.
సముద్రంలో వృథాగా కలిసిపోయే 3 వేల టీఎంసీల్లో 200 టీఎంసీలు వాడుకుంటామంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేష్ ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదన్నారు. అయినా హరీశ్ రావు కావాలని అక్కసు కక్కడం దారుణమన్నారు.
ఏపీ ప్రజలను పాకిస్థాన్ తీవ్రవాదులుగా భావించొద్దని కోరారు. పరస్పరం సహకరించు కుందామని, అన్నదమ్ముల్లా కలిసి కొనసాగుదామని పిలుపునిచ్చారు. రాయలసీమను గోదావరి జలాలతో రతనాల సీమ చేస్తానన్న కేసీఆర్ మాటలను మరిచి పోతే ఎలా అని నిలదీశారు.
Somireddy Chandra Mohan Reddy Slams BRS Party
మంచి మనస్సు చేసుకుని బనకచర్ల ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
1540 టీఎంసీలను నికర జలాలుగా నిర్ధారించారని, ఏపీకి 572 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించారని పేర్కొన్నారు. ఇప్పటివరకు అన్ని ప్రాజెక్టులు కలిపినా రెండు రాష్ట్రాలు 800 టీఎంసీలను కూడా వాడుకోలేక పోతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 301 టీఎంసీలను వాడుకోవాలని సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక ఆ జలాలను ఇప్పటి వరకు వాడుకోలేదన్నారు. పట్టిసీమ ద్వారా కొంత నీటిని పంపింగ్ చేసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఏటా 2500 నుంచి 3 వేల టీఎంసీల జలాలు వరద రూపంలో సముద్రంలో కలిసి పోతున్నాయన్నారు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి.
వరదల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని తమ ప్రాంత రైతులు, ప్రజలు ఏటా రూ.2 వేల కోట్లు నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ భాగంలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఎలాంటి వరద కష్టాలు లేవన్నారు. రాష్ట్రం విడి పోయినంత మాత్రాన మన మధ్య బేధాలెందుకంటూ ప్రశ్నించారు. సముద్రంలోకి అయినా నీటిని వథాగా పోనిస్తాం..కానీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ వాడుకోవడానికి ఒప్పుకోబోమని హరీష్ రావు చెప్పడం బాధాకరం అన్నారు.
Also Read : CM Chandrababu Fired on YS Jagan : వైఎస్ జగన్ రెడ్డి ఘరానా మోసగాడు : సీఎం















