ఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి స్మృతి జె ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో సమర్తవంతమైన నాయకత్వం కలిగి ఉండడం వల్ల అభివృద్ది పరుగులు పెడుతోందని చెప్పారు. ఇదే సమయంలో ప్రపంచాన్ని ప్రస్తుతం ప్రభావితం చేస్తున్న అతి కొద్ది మంది దేశాధినేతలలో ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టాప్ లో కొనసాగుతున్నారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కొనసాగుతుండడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. ఇదే సమయంలో రాజకీయ పరంగా అపారమైన అనుభవం కలిగిన నాయకుడిగా పేరు పొందారంటూ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు స్మతీ ఇరాని.
ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మకమైన మీడియా సంస్థ టైమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 ఇంపాక్ట్ డిన్నర్ లో పాల్గొనడం, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో ఆనందంగా ఉందన్నారు. ఇది మరిచి పోలేనని పేర్కొన్నారు స్మృతీ ఇరానీ. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పాలన, సాంకేతికత ఆధారిత పరిష్కారాలు , ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలు భారతదేశ తదుపరి దశ అభివృద్ధిని ఎలా రూపొందిస్తాయనే దానిపై తాము సంభాషించామని చెప్పారు. డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాల నుండి భవిష్యత్ పరిశ్రమలకు నైపుణ్యం వరకు, విధాన దృష్టిని అమలు సామర్థ్యంతో సమలేఖనం చేయడం ప్రాముఖ్యతను చర్చ నొక్కి చెప్పిందన్నారు.
అంతే కాకుండా వికసిత్ భారత్ కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు, మన పోటీతత్వం సాంకేతికతను నమ్మకంతో, ఆవిష్కరణను చేరికతో ఆశయాన్ని సంస్థాగత బలంతో అనుసంధానించే మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు.
