Smita Sabharwal : హైదరాబాద్ : తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సంచలనంగా మారారు. ఆమె తన పనితీరు కంటే వ్యక్తిగత కామెంట్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా వైరల్ అవుతూ వస్తున్నారు. తాజాగా మరోసారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) కీలకంగా మారారు. గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కీలకమైన పాత్ర పోషించారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. అన్నీ తానే అయి వ్యవహరించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో ఉన్నట్టుండి ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అప్రధాన్యత పోస్టులలో నియమించడం, దీనిపై ఆమె కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే సమయంలో తను కేంద్ర సర్వీసులోకి వెళుతుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.
Smita Sabharwal Approach Telangana High Court
కొత్త సర్కార్ వచ్చాక కేసీఆర్ హయాంలో రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణకు ఆదేశించింది. ఈ సందర్బంగా రిటైర్డ్ జడ్జి ఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిషన్ పూర్తి నివేదికను సమర్పించింది. ఇందులో కేసీఆర్, హరీశ్ రావుతో పాటు అప్పటి సర్కార్ లో కీ రోల్ పోషించిన స్మితా సబర్వాల్ కు పాత్ర ఉందంటూ పేర్కొన్నారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ నివేదికలో తన పేరు తొలగించాలని హై కోర్టుకు విన్నవిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే స్మితా సబర్వాల్‌ను ప్రశ్నించింది జస్టిస్ ఘోష్ కమిషన్. మూడు బ్యారేజీల నిర్మాణంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేసింది. సీఎం అనుమతి కోసం వెళ్లే ఫైల్స్ పరిశీలించడం, అందులో లోపాలను సరిచేయడం వరకే తన పాత్ర అని చెప్పింది స్మితా సబర్వాల్.
Also Read : USA Shocking – H-1B Visa : హెచ్ 1 బి వీసా జారీలో కీలక మార్పులు
