Sleeping Problems : మీకు రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..అయితే ఈ టీ తాగండి

మంచి ప్రభావం చూపే గుణాలు గ్రీన్ టీలో ఉన్నాయనేది పలు అధ్యయనాల ద్వారా వెల్లడైంది...

Hello Telugu - Sleeping Problems

Hello Telugu - Sleeping Problems

Sleeping Problems : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం, సమయానికి తీసుకునే ద్రావణాలు ఎంతో కీలకం. ఉదయం శక్తివంతమైన ఆరంభం అవసరమైనట్టే, రాత్రి శరీరానికి విశ్రాంతిని అందిస్తూ ప్రశాంతంగా నిద్రపోవడం కూడా తక్కు కాదు. అలాంటి సమయాల్లో గ్రీన్ టీ (Green Tea) మంచి సహాయకారి. శరీరానికి రిలీఫ్ ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపే గుణాలు గ్రీన్ టీలో ఉన్నాయనేది పలు అధ్యయనాల ద్వారా వెల్లడైంది.

Sleeping Problems – గ్రీన్ టీ ప్రయోజనాలు

1. ఒత్తిడిని తగ్గిస్తుంది

గ్రీన్ టీలో సహజంగా ఉండే “ఎల్ థియనిన్” అనే అమైనో ఆమ్లం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇది మెదడును నెమ్మదిగా విశ్రాంత స్థితిలోకి తీసుకెళ్లి నిద్రకు సహాయపడుతుంది. రోజంతా తలెత్తిన ఒత్తిడిని దూరం చేసేందుకు రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గ్రీన్ టీ మంచిదని నిపుణులు చెబుతున్నారు.

2. జీవక్రియ (మెటాబాలిజం) పెరుగుతుంది

గ్రీన్ టీ (Green Tea) శరీరంలోని కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొవ్వు కణాలపై ప్రభావం చూపి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, గ్రీన్ టీ వల్ల జీవక్రియ రేటు 4 శాతం వరకు పెరుగుతుందని తేలింది.

3. గుండె ఆరోగ్యానికి మేలు

చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. జపాన్‌లో జరిగిన ఒక అధ్యయనంలో రోజుకు ఐదు కప్పుల గ్రీన్ టీ తాగే వారి వద్ద గుండెపోటు, స్ట్రోక్‌ రిస్క్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

4. నిద్ర నాణ్యత మెరుగవుతుంది

నిద్రలేమితో బాధపడేవారికి గ్రీన్ టీ సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఎల్ థియనిన్ హార్మోన్లను సమతుల్యం చేసి, మెదడును ప్రశాంత స్థితిలో ఉంచుతుంది. దీని వల్ల నిద్ర గాఢంగా వస్తుంది.

5. శరీరానికి హాయిగా అనిపిస్తుంది

చల్లని వాతావరణంలో గ్రీన్ టీ తాగడం శరీరాన్ని హాయిగా ఉంచుతుంది. ఇది ఒక్క ఫిజికల్ రిలీఫ్ మాత్రమే కాదు, మానసికంగా కూడా విశ్రాంతిని అందిస్తుంది.

నిపుణుల సూచన

రోజు ముగింపులో ఒక కప్పు గ్రీన్ టీ తాగడం ద్వారా శరీరానికి విశ్రాంతి, మెరుగైన నిద్ర, హృదయ ఆరోగ్యం, జీవక్రియలో మార్పులు వంటి ప్రయోజనాలు లభించవచ్చు. అయితే దీన్ని కూడా సమతుల్య జీవనశైలిలో భాగంగా వినియోగించుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందించబడింది. మీ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.

Also Read : Apple Interesting Benefits : ప్రతి రోజు ఒక ఆపిల్ తినడం మంచిదేనా..

Exit mobile version