Sirikonda Madhusudhana Chari Interesting : ఉద్యోగుల‌కు ఆత్మ బంధువు ప‌ద్మాచారి

ప్ర‌శంసించిన సిరికొండ మ‌ధుసూదనా చారి

Hello Telugu - Sirikonda Madhusudhana Chari Interesting

Hello Telugu - Sirikonda Madhusudhana Chari Interesting

Sirikonda Madhusudhana Chari : హైద‌రాబాద్ : మాజీ స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి (Sirikonda Madhusudhana Chari) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఉద్యోగ సంఘం నాయ‌కుడు ప‌ద్మాచారిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఉద్యోగుల‌కు ఆత్మ బంధువు అని పేర్కొన్నారు. అన్నా అంటే నేనున్నా అనే పద్మన్న ఉండటం గర్వ కారణం అన్నారు. హైద‌రాబాద్ లక్డికాపూల్ లోని రవీంద్ర భారతిలో శ్రీ శాంతిక్రిష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో విశ్వకళా వైభవం 1113వ అంతర్జాతీయ సంస్కృతిక సంబర మహోత్సవంలో భాగంగా పురస్కారాలను ప్రదానం చేశారు.

Sirikonda Madhusudhana Chari Comments

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలంగాణ శాసన మండలి విపక్ష నేత, తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ పద్మాచారి ఓ చిచ్చర పిడుగు అన్నారు. ఉద్యోగులకు ఎక్కడ సమస్య ఎదురైనా, ఎలాంటి అన్యాయం జరిగినా, ఎదుటి వారు ఎంతటి శక్తివంతులైనా ఎదురించి ఢీ అంటే ఢీ అని పోరాడి సమస్యను పరిష్కరించే యోధుడు పద్మాచారి అని పేర్కొన్నారు.

పద్మన్న, నేను తెలంగాణ ఉద్యమంలో చాలా ఏళ్లుగా కలిసి పోరాటం చేశామ‌న్నారు మ‌ధుసూద‌నాచారి. . సమస్యలు పరిష్కరించేటువంటి కేంద్ర స్థానం సచివాలయం. ఆ సెక్రటేరియట్ ఉద్యోగులకు సమస్యలు ఎదురైతే పరిష్కారం చూపెట్టే వ్యక్తి దటీజ్ పద్మాచారి అని అన్నారు. పద్మాచారి గారికి ఈ పురస్కారానికి ఎంపిక చేయడాన్ని పూర్తిగా అభినందిస్తున్నానని సిరికొండ మధుసూదనాచారి నిర్వాహకులను కొనియాడారు.

Also Read : EC Shocking New Parties : ఏపీ, తెలంగాణ‌లో 25 పార్టీల ర‌ద్దు : ఈసీ

Exit mobile version