కీల‌క ప్ర‌తిపాద‌న‌ల‌కు ఎస్ఐపీబీ ఆమోదం

సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న స‌మావేశం

hellotelugu-APSIPB

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పాల‌నా ప‌రంగా దూకుడు పెంచారు. అమ‌రావ‌తిలోని సచివాల‌యంలో సీఎం అధ్య‌క్ష‌త‌న 13వ ఎస్ఐపీబీ కీల‌క‌మైన స‌మావేశం జ‌రిగింది. ఇందులో ప్ర‌త్యేకంగా రాష్ట్రానికి కావాల్సిన ప్ర‌ధాన అంశాలు, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలకు ఆమోదం తెలపింది ఎస్ఐపీబీ. ఇదిలా ఉండ‌గా ఎస్ఐపీబీలో దాదాపు 26 కంపెనీలకు చెందిన రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ జ‌రిగింది విస్తృతంగా.

ఇందులో ప్ర‌ధానంగా ఎనర్జీ, ఐటీ, ఐ అండ్ ఐ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది ఎస్ఐపీబీ. ఇటీవల పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న వివిధ ఒప్పందాల గురించి చ‌ర్చించారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా విశాఖ న‌గ‌రంలో విశాఖ స‌మ్మిట్ పేరుతో బిగ్ స‌మ్మిట్ నిర్వ‌హించారు. ఏకంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌పంచంలోని దిగ్గజ కంపెనీలు , ప్ర‌తినిధులు, చైర్మ‌న్లు, క‌న్స‌ల్లెంట్స్, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు పాల్గొని ఈ మేర‌కు రాష్ట్ర స‌ర్కార్ తో, సీఎంతో కీల‌క‌మైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ జ‌రిగిన ఎస్ఐపీబీ స‌మావేశంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version