Singireddy Niranjan Reddy Fired on Kavitha : కేసీఆర్ ను బ‌ద్నాం చేస్తున్న‌ది నువ్వు కాదా ..?

ఎమ్మెల్సీ క‌విత‌పై సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి ఫైర్

Hello Telugu - Singireddy Niranjan Reddy Fired on Kavitha

Hello Telugu - Singireddy Niranjan Reddy Fired on Kavitha

Singireddy Niranjan Reddy : వ‌న‌ప‌ర్తి జిల్లా : ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత త‌న‌పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy). నేను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించు కోలేదని, కానీ నువ్వే లిక్కర్ రాణి అని పిలిపించుకున్నావంటూ ఎద్దేవా చేశారు. నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు, నువ్వు ఆడక పోతే బతుకమ్మే లేనట్టు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావని మండిప‌డ్డారు. ఓట్ల కోసం తండాల్లో తిరుగుతుంటే, మీ కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే ఏం కాదు కానీ మేము సారా కాస్తే అరెస్టు చేయిస్తారా అని నన్ను లంబాడా మహిళలు నిలదీశారని అన్నారు. కేసీఆర్ కూతురు కాబట్టే నీకు ఇంకా గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నామని అన్నారు. ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవడం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నిరంజ‌న్ రెడ్డి.

Singireddy Niranjan Reddy Slams Kavitha

తామంతా కేసీఆర్ కి మంచి పేరు తెస్తుంటే, నువ్వు ఆయనను మానసికంగా వేధిస్తున్నావంటూ ఆవేద‌న చెందారు. ఎవరిని సంతోషపెట్టడానికి కవిత నాపై ఆరోపణలు చేస్తుందో అర్థం కావ‌డం లేద‌న్నారు మాజీ మంత్రి. నీ అహంకారం, నీ చర్యలు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయని ఆరోపించారు. త‌న‌కు సంబంధించి కేవ‌లం ఒకే ఒక్క వ్యవసాయ క్షేత్రం మాత్రమే ఉందన్నారు. మ‌రి నీకు గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదా? అన్ని పైసలు నీకు ఎక్కడివి అని ప్ర‌శ్నించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఉద్దేశించి. తండ్రి వయసు ఉన్న ఎమ్మెల్యే లను ఇంటికి పిలిపించుకుని, జాగృతిలో చేరాలని అడిగి, ఒప్పుకోని నా లాంటి వాళ్ల మీద ఆరోపణలు వేస్తున్నావంటూ మండిప‌డ్డారు.

Also Read : CM Revanth Reddy New Innovation : రూ. 103 కోట్ల‌తో అభివృద్ది ప‌నుల‌కు సీఎం శ్రీ‌కారం

Exit mobile version