CM Revanth Reddy New Innovation : రూ. 103 కోట్ల‌తో అభివృద్ది ప‌నుల‌కు సీఎం శ్రీ‌కారం

స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy New Innovation

Hello Telugu - CM Revanth Reddy New Innovation

CM Revanth Reddy : వికారాబాద్ జిల్లా : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఆయ‌న‌తో పాటు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. త‌న నియోజకవర్గం కొడంగల్ లో రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 5.83 కోట్లతో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం. రూ. 5.01 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ. 3 కోట్లతో 10 గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణంకు శంకుస్థాప‌న చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy Announces 103 crores for Developments

రూ. 3.65 కోట్లతో బంజారా భవన్ కు అదనపు సౌకర్యాలు క‌ల్పిస్తున్నట్లు తెలిపారు సీఎం. అంతే కాకుండా రూ. 1 కోటితో కొడంగల్‌లో ప్రొహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రూ. 1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం చేప‌ట్టామ‌న్నారు. రూ. 4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు ,కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. రూ. 4.45 కోట్లతో సిసి రోడ్లు ,భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కూడా చేప‌ట్ట‌నున్న‌ట్లు ఈ సంద‌ర్బంగా తెలిపారు సీఎం. రూ.60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణతో పాటు రూ. 5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో అభివృద్ధి పనులు కూడా చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

Also Read : CM Chandrababu Clear Instructions : పౌర సేవ‌లు మ‌రింత మెరుగు ప‌డాలి

Exit mobile version