Singireddy Niranjan Reddy : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నియంత పోకడలతో నికృష్టపు మాటలతో సీఎం పరువును బజారు కీడుస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ లక్కీ భాస్కర్ అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభలో రాజకీయ విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని అన్నారు. ఎన్నిసార్లు మందలించినా రేవంత్ రెడ్డి తన భాషను మార్చు కోవడం లేదన్నారు. వెళ్లిన ప్రతిచోటా పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడని, ఆయన మాటలను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఖండించారని అయినా బుద్ది రావడం లేదన్నారు.
Singireddy Niranjan Reddy Slams CM Revanth Reddy
కొల్లాపూర్‌లో నిర్వహించిన సభలో 40 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 38 సార్లు కేసీఆర్ గారి నామస్మరణ చేశారని ఫైర్ అయ్యారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలమూరుకు ఏం చేశాడో చెప్పాలన్నారు. కేసీఆర్ నామస్మరణతో రేవంత్ తన పాప ప్రక్షాళన చేసుకుంటున్నాడని భావిస్తున్నామని అన్నారు నిరంజన్ రెడ్డి (Singireddy Nirajan Reddy). అడుగడుగునా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుని, ఇక్కడున్న బిడ్డల బలిదానాలకు కారణం అయిన చంద్రబాబు నాయుడును వేడుకోవడం దారుణమన్నారు.
ఆరె నెలల క్రితం శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా స్కూల్‌కు ఇంతవరకు దిక్కు లేదు. మళ్లీ మరో పాఠశాలకు శంకుస్థాపన చేశారు.. కొత్తగా పాలమూరుకు చేసింది ఏమిటి అంటూ మండిపడ్డారు. ఆది నుండి తెలంగాణకు ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీ.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను నిర్మించాల్సిన స్థలాలను మార్చారని ఆరోపించారు. తెలంగాణ విధ్వంసం అయింది, సర్వనాశనం అయింది కాంగ్రెస్ పాలనలోనే.. ఆ తర్వాత టీడీపీ, చంద్రబాబు నాయుడు పాలనలోనే.. ఈ విషయం కాంగ్రెస్ నేతలు శ్రీ కృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది కాంగ్రెస్ పాలనలోనే.. జూరాల నిర్మాణానికి నాలుగు దశాబ్దాల సమయం తీసుకున్నారు.. 87,500 ఎకరాలు పారే ఆర్డీఎస్ కెనాల్‌ను 8 వేల ఎకరాలకు పరిమితం చేశారని మండిపడ్డారు.
Also Read : ED Strong Notices to Google Meta : గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు
