సీఎం ప‌ద‌వి వివాదంపై హైక‌మాండ్ దే ఫైన‌ల్

స్పష్టం చేసిన ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య

hellotelugu-CMSiddaaramaiah

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఇంకా సీఎం ప‌ద‌విపై వివాదం కొన‌సాగుతూనే ఉంది. రోజుకో వార్త గుప్పు మంటోంది. ప్ర‌స్తుతం రెండు వ‌ర్గాలుగా విడి పోయినా ఎవ‌రికి వారు త‌మ ప్ర‌యత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒక వైపు సిద్ద‌రామ‌య్య ఇంకో వైపు డీకే శివ‌కుమార్ ల మ‌ధ్య ప‌వ‌ర్ కోసం అంత‌ర్గ‌త పోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే హైకమాండ్ ప‌లుమార్లు జోక్యం చేసుకుంది. త్వ‌ర‌లోనే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని ఈ ఇద్ద‌రితో చెప్పించింది. ఇదంతా కేంద్రంలోని బీజేపీ ఆడిస్తున్న నాట‌కం అంటూ మండిప‌డింది. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌లో ఆయా ప్ర‌భుత్వాల‌ను అస్థిర ప‌ర్చ‌డం త‌ప్ప బీజేపీకి మ‌రేం ప‌ని లేద‌న్నారు. త‌మ స‌ర్కార్ క‌చ్చితంగా మ‌రో రెండున్న‌ర ఏళ్లు పాలిస్తుంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా బుధ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. ఆయ‌న బెళ‌గావిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మీ ప‌ద‌వి పోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగ‌తోంద‌ని దీనిపై మీరేమంటార‌న్న ప్ర‌శ్న‌కు ఆయ‌న తెలివిగా స‌మాధానం ఇచ్చారు. త‌న ప‌ద‌వికి వ‌చ్చిన ప్ర‌మాదం ఏమీ లేద‌న్నారు. ఎవ‌రు ఉండాలో ఎవ‌రు ఉండ కూడ‌ద‌నే దానిపై పూర్తిగా హై క‌మాండ్ తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు. తానైనా లేదా పోటీ ప‌డుతున్న డీకే శివ‌కుమార్ అయినా పార్టీ హైక‌మాండ్ తీసుకునే తుది నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే తుర్దాల్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశానని, హామీ పథకాలపై ఎటువంటి చర్చ జరగలేదని ముఖ్యమంత్రి చెప్పారు.

Exit mobile version