Test Tube Baby Scam : ‘సృష్టి’లో అసలు సరోగసి అన్నదే లేదు

హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్

Hello Telugu - Test Tube Baby Scam

Hello Telugu - Test Tube Baby Scam

Test Tube Baby Scam : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ స్కాం వ్య‌వ‌హారం కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. ఈ కేసుకు సంబంధించి కీల‌క అంశాలు వెల్ల‌డించారు హైద‌రాబాద్ నార్త్ జోన్ డీసీపీ ర‌ష్మీ పెరుమాల్ (DCP Rashmi Perumal). సృష్టిలో అసలు సరోగసి అన్నదే లేదన్నారు. వేరే వాళ్లకు పుట్టిన పిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారని స్ప‌ష్టం చేశారు. బిడ్డను ఇచ్చే మహిళలకు ఒక్కొక్కరికి రూ. 80 నుంచి 90 వేలు ఇచ్చి తీసుకొస్తున్నారని చెప్పారు.

Test Tube Baby Scam at Hydderabad

పిల్లల కోసం వచ్చే దంపతుల నుంచి రూ.30 లక్షలకు పైగా వసూళ్లు చేస్తున్నారని త‌మ విచార‌ణ‌లో తేలింద‌న్నారు. గతంలోనూ డాక్టర్ నమ్రత ఇలాంటి కేసులను చాలా డీల్ చేసింద‌న్నారు. తమను ఎవరైనా ప్రశ్నిస్తే , త‌న కొడుకు లాయ‌ర్ అని బెదిరింపుల‌కు పాల్ప‌డింద‌ని , కేసులు వేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చింద‌న్నారు డీసీపీ ర‌ష్మీ పెరుమాల్. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేశామ‌న్నారు.
సృష్టి హాస్పిటల్ కేసులో నిందితులకి 14 రోజులు రిమాండ్ కోర్టు విధించింద‌ని చెప్పారు. నిందితుల్ని చంచల్ గూడ జైలుకు తరలించడం జ‌రిగింద‌న్నారు.

ప్రధాన నిందితురాలుగా ఉన్న A1 నమ్రత పాత్రపై ఆరా తీస్తున్న‌ట్లు తెలిపారు డీసీపీ. దేశంలో అనేక చోట్ల సృష్టి హాస్పిటల్ కి సంబంధించి బ్రాంచ్ లు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించామ‌న్నారు. సరోగసి , ఐవీఎఫ్, ఐయూఐ విధానాల ద్వారా పిల్లలు కలిగిస్తామని భారీ మొత్తంలో డబ్బులు కాజేశారంటూ చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన సోనియా గోవింద్ సింగ్ దంపతులు IVF ద్వారా బిడ్డ కావాలని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించార‌ని, వారికి సరోగసీ మార్గాన్ని డాక్టర్ నమ్రత సూచించార‌ని తెలిపారు.

Also Read : Hyderabad Hospital Sensational : సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు పర్మిషన్స్ లేవు

Exit mobile version