Surya Kumar Yadav Important Update : శ్రేయాస్ అయ్య‌ర్ కోలుకుంటున్నాడు : సూర్య‌కుమార్

మెరుగైన వైద్యం అందిస్తున్నార‌ని వెల్ల‌డి

Hello Telugu - Surya Kumar Yadav Important Update

Hello Telugu - Surya Kumar Yadav Important Update

Surya Kumar Yadav : ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా జ‌ట్టుతో జ‌రిగిన మూడో వ‌న్డేలో తీవ్రంగా గాయ‌ప‌డి ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు స్టార్ క్రికెట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్. ఇప్ప‌టికే మేనేజ్ మెంట్ తో పాటు బీసీసీఐ సైతం త‌న ఆరోగ్యం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తోంది. ఈనెల 29వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో టి20 సీరీస్ ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్బంగా త‌న‌ను కూడా టి20 ఫార్మాట్ లో ఆడాల్సి ఉంది. ఇప్ప‌టికే ఫైన‌ల్ జ‌ట్టును ఖ‌రారు చేసింది. జ‌ర‌గ‌బోయే మ్యాచ్ లో త‌ను ఆడ‌తాడో లేడోన‌న్న అంశంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు టి20 టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ (Surya Kumar Yadav). ఈ సంద‌ర్బంగా త‌ను మీడియాతో మాట్లాడారు ఆస్ట్రేలియాలో.

Surya Kumar Yadav Important Update for Shreyas Iyer Health Condition

ప్ర‌స్తుతం శ్రేయాస్ అయ్య‌ర్ ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో ఉన్నాడ‌ని, మెరుగైన వైద్యం అందిస్తున్నారని, త‌ను కోలుకుంటున్నాడ‌ని చెప్పారు సూర్య భాయ్. తాను ఎప్ప‌టిక‌ప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాన‌ని, ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. త‌ను పూర్తిగా కోలుకున్నాడ‌ని తెలిపాడు. అయితే ఇలా జ‌ర‌గాల్సి ఉండేది కాద‌న్నాడు. వైద్యులు మెరుగైన , నాణ్య‌మైన వైద్యం అందిస్తున్నార‌ని చెప్పాడు. రాబోయే మ‌రికొన్ని రోజులు పరీక్షిస్తున్నార‌ని చెప్పాడు సూర్య కుమార్ యాద‌వ్. ఆందోళ‌న‌కు గురి కావ‌ద్ద‌ని, త్వ‌ర‌లోనే త‌ను కోలుకుంటున్నాడ‌ని వైద్యులు భ‌రోసా ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు ఇండియా జ‌ట్టు కెప్టెన్.

Also Read : Real Time Voice Alert – AP Growth : ఏపీలో రియ‌ల్ టైమ్ వాయిస్ అల‌ర్ట్

Exit mobile version