Shreyas Iyer : ముంబై – దీర్ఘకాలం ప్లాన్ లో భాగంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వన్డే జట్టుకు స్కిప్పర్ గా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు నాయకుడిగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ కు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. రోహిత్ శర్మకు లాంగ్ టర్మ్ ఆప్షన్‌గా అయ్యర్‌కు (Shreyas Iyer) బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడే భారత జట్టును ప్రకటించింది. అయితే అయ్యర్ కు ఛాన్స్ దక్కలేదు. దీంతో హెడ్ కోచ్ గంభీర్ , సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాగా హిట్ మ్యాన్ వన్డే, టి20 ఫార్మాట్ కు రిటైర్ ప్రకటించాడు. రోహిత్ శర్మతో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం తప్పు కోవడంతో ఆ లోటును భర్తీ చేసే ఆటగాళ్ల కోసం వెతుకుతోంది బీసీసీఐ.
Shreyas Iyer Updates
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ను టార్గెట్ చేశారు. పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. తన వల్లనే శ్రేయాస్ అయ్యర్ ను ఆసియా కప్ టీమిండియా స్క్వాడ్ లో ఎంపిక చేయలేదంటూ మండిపడ్డారు. దీంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి స్టార్ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ గా గుర్తింపు పొందిన శ్రేయాస్ అయ్యర్ అనుభవం, ఆట తీరు దృష్ట్యా తనను వన్డే జట్టుకు స్కిప్పర్ గా చేస్తేనే బావుంటుందని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నారని, అందులో భాగంగానే తన ఎంపిక దాదాపు ఖారైనట్లు క్రికెట్ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : ICC Top Rankings Interesting : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కేశవ్ మహారాజ్ టాప్



















