ముంబై : భారత క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ , రన్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ రంగంలో సంచలనంగా మారాడు. తాజాగా ఈ ఏడాది నిర్వహించిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) టోర్నమెంట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరపున, ఇతర జట్ల ఆటగాళ్ల కంటే అత్యధిక పరుగులు చేశాడు. తన సత్తా ఏమిటో చూపించాడు. వరుస హాఫ్ సెంచరీలతో కదం తొక్కాడు. దీంతో గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా ఐపీఎల్ కప్పును ఎగరేసుకు పోయింది ఆర్సీబీ టీం. ఇందులో ముఖ్య భూమిక పోషించాడు విరాట్ కోహ్లీ. తన ఆటతీరుతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఒక జట్టుకు ప్లేయర్ ఎంత కీలకమో చెప్పకనే చెప్పాడు.
తాజాగా తన పదవీ విరమణ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎట్టకేలకు తన టెస్ట్ రిటైర్మెంట్ వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు, అది నిజంగా హృదయ విదారకమైన విషయం. చూడండి, మీరు పని కోసం ఒక చోటికి వెళ్ళినప్పుడు, వారు మీ సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉందని చెబుతూనే, కేవలం వారం రోజుల తర్వాత మళ్ళీ మీపై సందేహాలు వ్యక్తం చేస్తూ మీ పనితీరును ప్రశ్నిస్తే, అది ఏమాత్రం సరికాదు. మొదటి రోజే నేను ఆ స్థాయికి సరిపోనని చెప్పేయాలి, లేదా నాపై నిజంగా నమ్మకం ఉంటే, నన్ను ప్రశాంతంగా నా పనిని చేసుకోనివ్వాలని అన్నాడు విరాట్ కోహ్లీ.
నేను నా ‘బ్యాక్-ఫుట్ షాట్స్’ మెరుగు పరుచుకోవడంపై కఠోర శ్రమ చేస్తున్నానని చెప్పాడు, అలాగే రంజీ ట్రోఫీ క్రికెట్ కూడా ఆడుతున్నాను. కానీ సెలెక్టర్లు నాతో, ‘మొదటి రెండు టెస్టులు ఆడండి, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన కోసం మిమ్మల్ని పరిశీలిస్తాం’ అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు, నాపై వారికి పూర్తి నమ్మకం లేదని, నన్ను సందేహిస్తున్నారని నాకు అనిపించింది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.



















