శ‌ర‌వేగంగా ‘జనవరి 12 విడుదల’ మూవీ షూటింగ్

విక్ట‌రీ వెంక‌టేష్, క‌ళ్యాన్ రామ్ కీ రోల్స్

hellotelugu-Januaryy12idudala

క‌ర్ణాట‌క : టాలీవుడ్ లో అత్యంత స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా పేరు పొందారు అనిల్ రావిపూడి. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ‘జనవరి 12 విడుదల ఊటిలో ఇవాల్టి నుంచి షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు మూవీ మేక‌ర్స్. ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేశ్, క‌ళ్యాణ్ రామ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇప్ప‌టికే విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించారు ముందుగానే ద‌ర్శ‌కుడు . 2027 జనవరి 12న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం కోసం 12 రోజుల పాటు సాగే ఊటీ షూటింగ్ షెడ్యూల్ మొదలైంది. ఇందులో రెండు పాటలు, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ప్రముఖ నటులు వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్‌లతో కలిసి ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 12న సినిమా విడుదల కానుండటంతో చిత్ర బృందం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది.

2026 ద్వితీయార్థంలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు ప్రధాన షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడవది , అత్యంత ముఖ్యమైన ఊటీ షెడ్యూల్ కూడా మొదలైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులకు ఆనందాన్ని పంచింది. జ‌న‌వ‌రి 12 విడుద‌ల కోసం అందమైన ఊటీ షెడ్యూల్ మొదలైంది. అద్భుతమైన లొకేషన్లలో రెండు పాటలు , కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా 12 రోజుల షెడ్యూల్‌ను బృందం ప్రారంభించింది. 2027 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఇందులో అందాల భామ‌లు కీర్తి సురేష్, కృతి శెట్టి సెట్స్‌లో సరదాగా గడుపుతున్న వీడియో చాలా అద్భుతంగా ఉంది. చీరకట్టులో హీరోయిన్లు ఇద్దరూ ఎంతో అందంగా కనిపించారు.

Exit mobile version