క‌జ‌కిస్తాన్ లో ‘జనవరి 12 విడుదల’ షూటింగ్

మ‌రోసారి హిట్ కొట్టేందుకు రావిపూడి రెడీ

hellotelugu-January12Vidudala

హైద‌రాబాద్ : తెలుగు సినీ రంగంలో అత్యంత విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుల‌లో నెంబ‌ర్ ఒన్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు అనిల్ రావిపూడి. త‌నను న‌మ్మి ఛాన్స్ ఇచ్చింది క‌ళ్యాణ్ రామ్ నంద‌మూరి. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడికి ఎదురే లేకుండా పోయింది. టాప్ హీరోల‌తో త‌ను తీసిన ప్ర‌తి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేష్ తో త‌ను వ‌రుస‌గా మూడో మూవీ తీస్తున్నాడు అనిల్ రావిపూడి. తాజాగా ‘జనవరి 12 విడుదల’ తీస్తున్నాడు. ప‌లు లొకేష‌న్ల‌లో షూటింగ్ కొన‌సాగుతోంది. ఇందుకు సంబంధించి ఫోటోలను షేర్ చేశారు మూవీ మేక‌ర్స్. తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం క‌జ‌కిస్తాన్ లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఊటీలో షూటింగ్ షెడ్యూల్ పూర్త‌యింది. విక్టరీ వెంకటేష్ , నందమూరి కల్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న సంక్రాంతి చిత్రం ‘జనవరి 12 విడుదల’ షూటింగ్ ప్రస్తుతం క‌జ‌కిస్తాన్ లోని ప‌లు ప్రాంతాల‌లో కొన‌సాగుతోంది.

ఈ షెడ్యూల్‌లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, పాటలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ ‘రియల్’ సతీష్ పర్యవేక్షణలో అత్యంత ఉత్కంఠ భరితమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది. అలాగే వెంకటేష్ , కల్యాణ్ రామ్‌లపై ఒక ప్రత్యేక పాటను కూడా చిత్రీకరించనున్నారు; దీనికి శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన , జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ఇందులో కీర్తి సురేష్ , కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ‘బావ-బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, కుటుంబ అనుబంధాలు, హాస్యం , కమర్షియల్ అంశాలతో కూడిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించగా, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version