వృష‌క‌ర్మ నుండి స్వాగ్ ఆఫ్ అర్జున్ సాంగ్ రిలీజ్

ముఖ్య పాత్ర పోషించిన అక్కినేని నాగ చైత‌న్య

hellotelugu-Vrushakarma

హైద‌రాబాద్ : అక్కినేని నాగ‌ చైతన్య నటించిన ‘వృషకర్మ’ చిత్రం నుండి స్వాగ్ ఆఫ్ అర్జున్ గీతం విడుదలయింది. టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య తన తాజా చిత్రం ‘వృషకర్మ’తో డిసెంబర్ 4 ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’కు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేసి అభిమానులకు కానుకగా అందించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్ట్‌లో “యువ సామ్రాట్ నాగ చైతన్య సరికొత్త ‘స్వాగ్’ ‘ఆటిట్యూడ్’తో వచ్చేశారు. ‘వృషకర్మ’ చిత్రం నుండి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ పాట ఇప్పుడు అందుబాటులో ఉంది” అని పేర్కొన్నారు. ఈ పాట ఎంతో అద్భుతంగా ఉండటంతో పాటు, చిత్రంలో నాగ చైతన్య పాత్రకు సంబంధించిన ప్రత్యేకతలను ఆవిష్కరించింది.

మరోవైపు, ‘వృషకర్మ’ చిత్ర కథాంశం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్టర్ ప్రకారం ఈ చిత్ర కథ ఇలా ఉంది. పురాతన గుహల్లోని శిల్పాలను అర్థం చేసుకునే క్రమంలో అపార సంపద కోసం వెతికే ఒక నిధి వేటగాడు, పురావస్తు శాస్త్రంపై అమితమైన ఆసక్తి ఉన్న ఒక పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రపై అంకితభావం కలిగిన ఒక విద్యార్థ వీరంతా కలిసి ఒక రహస్య ప్రవచనాన్ని ఛేదించేందుకు సమయంతో పోటీ పడతారు. రాజ వంశానికి , రాబోయే వినాశనానికి ముడిపడి ఉన్న ఈ ప్రవచనాన్ని వెలికితీసే క్రమంలో వారు విధిని , దుష్ట శక్తులను ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ చిత్ర కథాంశం. వృషకర్మలో దర్భ అప్పాజీ అంబరీష, జయరామ్, మీనాక్షి చౌదరి, దయానంద్ రెడ్డి, స్పర్ష్ శ్రీవాస్తవ సమిష్టి తారాగణం ఉంది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్వీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Exit mobile version