త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తిన విషెస్

helotelugu-Trivikram

హైద‌రాబాద్ : మాట‌ల మాంత్రికుడిగా గుర్తింపు పొందారు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఇవాళ త‌న పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా టాలీవుడ్ ప్రముఖ చిత్రనిర్మాత నాగ వంశీ హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన ఈరోజు తన 55వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో త్రివిక్ర‌మ్ అభిమానులు, సహ నటులందరూ సోషల్ మీడియాలో హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రియమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్‌లో ఇలా ఉంది. ప్రఖ్యాత చిత్రనిర్మాత, గొప్ప రచయిత, విలక్షణమైన కథకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. తన అద్భుతమైన రచన, ఆకట్టుకునే కథనం ద్వారా ఆయన ప్రేక్షకులను అలరిస్తూ, స్ఫూర్తినిస్తూనే ఉన్నారు.

రాబోయే సంవత్సరాల్లో ఆయన మరెన్నో చిరస్మరణీయ చిత్రాలు, అద్భుతమైన మైలురాళ్లను సాధించాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు.. త్రివిక్రమ్ బెస్టీ నాగ వంశీ కూడా సోషల్ మీడియాలో హృదయ పూర్వక పుట్టినరోజు పోస్ట్‌ను పెట్టారు. ఆయన పోస్ట్‌లో ఇలా ఉంది. మీరు ప్రపంచాన్ని చూసే విధానంలో, మీరు మాటల్లో పెట్టే ఆలోచనలలో, మీ కథల ద్వారా మీరు ప్రాణం పోసే భావోద్వేగాలలో నిజంగా ఏదో ప్రత్యేకత ఉంది. అంతకంటే ప్రత్యేకమైనది, ఆ మాటలు తెరపైకి వచ్చినప్పుడు మీరు సృష్టించే మాయాజాలం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మీకు పుట్టినరోజు ప్రత్యేక శుభాకాంక్షలు త్రివిక్రమ్ సర్ అని పేర్కొన్నారు. మరెన్నో అందమైన కథలు, మరపురాని క్షణాలు, కలిసి చేసే మాయా ప్రయాణాలు మన మధ్య ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Exit mobile version