Shilpa Shirodkar Interesting Comments : మూవీస్ కోసం కాదు డిప్రెష‌న్ త‌ట్టుకోలేక వ‌చ్చా

స్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ‌ న‌టి శిల్పా శిరోద్క‌ర్

Hello Telugu - Shilpa Shirodkar Interesting Comments

Hello Telugu - Shilpa Shirodkar Interesting Comments

Shilpa Shirodkar : ప్ర‌ముఖ న‌టి శిల్పా శిరోద్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇండియాకు తిరిగి రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఆమె స్వ‌యంగా వెల్ల‌డించారు. సినిమాల‌లో న‌టించేందుకు ఇక్క‌డికి వ‌చ్చాన‌ని చాలా మంది ప్ర‌చారం చేస్తున్నార‌ని కానీ అందుకు కాద‌ని తెలిపింది. పూర్తిగా డిప్రెష‌న్ లోకి వెళ్లి పోయాన‌ని వాపోయారు. శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) తన నిర్ణయానికి సినిమా అవకాశాల కోసం ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నా మానసిక స్థితి బాగా లేద‌న్నారు. నా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన తర్వాత త‌న‌లో నిరాశ చోటు చేసుకుంద‌ని చెప్పారు. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం సోద‌రి , మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ వ‌ద్ద ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని తెలిపారు. అందుకే న్యూజిలాండ్ నుంచి రావాల్సి వ‌చ్చింద‌న్నారు.

Shilpa Shirodkar Comments

ఇదిలా ఉండ‌గా 1990లో పాపుల‌ర్ న‌టిగా పేరొందారు. 2010లో తిరిగి ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు సినీ రంగంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు శిల్పా శిరోద్క‌ర్. నేను ఎవ‌రినీ అడ‌గ‌లేదు. ఫోటో షూట్స్ కూడా చేయ‌లేదు. ఆ స‌మ‌యంలో పీఆర్ స్టంట్స్ లేదా మూవీ రంగం ప‌నితీరు గురించి ఎలాంటి అవ‌గాహ‌న లేద‌న్నారు న‌టి. న్యూజిలాండ్‌లో అంతా బాగానే ఉంది. నా భర్త అప్రేశ్ ఉద్యోగంలో ఉన్నత పదవిలో ఉన్నారు, నా కుమార్తె అనౌష్క తన సొంత స్నేహితుల బృందంతో పాఠశాలలో స్థిరపడింది. కానీ కొద్ది కాలంలోనే నా తల్లిదండ్రులను కోల్పోవడం నన్ను విచ్ఛిన్నం చేసింది. నేను దానిని భరించ లేక పోయాన‌ని వాపోయింది.

Also Read : Popular Actor Fish Venkat Death : సినీ న‌టుడు ఫిష్ వెంక‌ట్ క‌న్నుమూత‌

Exit mobile version