చెన్నై : సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళంస రియాల్టీ షోకు సమంత రూత్ ప్రభు సారథ్యం వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన వంటల కార్యక్రమం ఇప్పుడు తమిళ నైపుణ్యంతో సరికొత్తగా రాబోతోంది. సమంత రూత్ ప్రభు సారథ్యంలో తమిళ వినోద రంగానికి చెందిన ప్రముఖ తారలు ఇందులో పాల్గొననున్నారు. ఆహారం, రుచి, భావోద్వేగాలు, సాన్నిహిత్యాల కలయికగా సాగే ఈ కార్యక్రమం సోనీ విజా, ‘సోనీ లివ్స లో ప్రసారం కానుంది. ప్రముఖులు, ఆహారం , పోటీతత్వం అనే ఆసక్తికరమైన అంశాల కలయికగా రూపొందుతున్న సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళంలో తమిళ వినోద రంగానికి చెందిన ప్రముఖులు తమ సాధారణ షూటింగ్ సెట్ల నుండి వంట గదిలోకి అడుగు పెట్టనున్నారు. కఠినమైన వంట సవాళ్లు, ఊహించని మలుపులు, పోటీతో పాటు ప్రేక్షకులను మెప్పించేలా వంటకాలను రూపొందించే ఒత్తిడిని వారు ఎదుర్కోనున్నారు.
బనిజే ఆసియా నిర్మిస్తున్న ఈ కార్యక్రమం ‘మాస్టర్ చెఫ్’ ఫార్మాట్‌కు ఉన్న ప్రపంచ స్థాయి గుర్తింపును నిలుపు కుంటూనే, స్థానిక రుచులు, సుపరిచితమైన ప్రముఖులు , తమిళ సెలబ్రిటీ సంస్కృతికి సంబంధించిన ప్రత్యేకమైన అనుబంధంతో పూర్తిగా తమిళ శైలిలో సాగే అనుభూతిని అందిస్తుంది. ‘సోనీ విజా’లో ప్రధాన వినోద కార్యక్రమంగా నిలవనున్న ఇది ‘సోనీ లివ్’ ఇతర డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యేకమైన ‘షార్ట్-ఫామ్’ కంటెంట్‌ను కూడా అందిస్తుంది. దీనివల్ల ప్రేక్షకులు కేవలం ప్రధాన ఎపిసోడ్‌లకే పరిమితం కాకుండా, సెలబ్రిటీల వంట ప్రయాణాలు, సవాళ్లు , వంటగదిలో వారు గడిపిన మధుర క్షణాలకు మరింత దగ్గరయ్యే అవకాశం కలుగుతుంది.
ఈ కార్యక్రమం గురించి సమంత రూత్ ప్రభు ఇలా అన్నారు: చివరకు దీనిని అందరితో పంచుకోవడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం నేను ఇంతకు ముందు చేసిన వాటికి పూర్తిగా భిన్నమైనది, అందుకే దీనిని కాదనడం అసాధ్యం అనిపించింది. ఆహారానికి ప్రజలను ఏకం చేసే, మధురమైన జ్ఞాపకాలను సృష్టించే , సాధారణంగా కెమెరాలకు కనిపించని మీలోని మరో కోణాన్ని ఆవిష్కరించే అద్భుతమైన శక్తి ఉంది. మనకు ఇష్టమైన తమిళ ప్రముఖులు వంటగదిలోకి అడుగు పెట్టడం, కొత్త ప్రయోగాలు చేయడం, పొరపాట్లు చేయడం, తమను తాము ఆశ్చర్య పరచుకోవడం , ఊహించిన దానికంటే ఎక్కువ ఉత్సాహంతో పోటీపడటం చూడటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది అని పేర్కొంది.
