ఇమ్రాన్ ఖాన్ వ్య‌వ‌హారంపై శ‌శి థ‌రూర్ కామెంట్స్

ఆయ‌న ఆరోగ్యం గురించి పాక్ స‌ర్కార్ తెలియ చేయాలి

hellotelugu-SshiTharoor

ఢిల్లీ : తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు పాకిస్తాన్ దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ గురించి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు , మాజీ పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన త‌న ప‌ట్ల అప్ డేట్స్ ఇవ్వాల్సిన బాధ్య‌త ఆ ప్ర‌భుత్వంపై త‌ప్ప‌కుండా ఉంటుంద‌న్నారు. ప్ర‌ధానంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లపై కాంగ్రెస్ ఎంపీ స్పందించారు. ఈ సంద‌ర్బంగా మ‌రొక దేశం అంతర్గత వ్యవహారాలపై మనం వ్యాఖ్యానించడం సముచితం కాదని నేను భావిస్తున్నానని అన్నారు. కానీ ఈ విషయంపై ఇంత మౌనం ఉండటం ఖచ్చితంగా కొంత ఆందోళన కలిగించే విషయం అని పేర్కొన్నారు శ‌శి థ‌రూర్.

ఇంత దారుణంగా జరిగిందని పలువురు వ్యక్తులు చెబుతున్నారు, ఆపై తీవ్ర‌మైన ఆందోళ‌న‌కు లోన‌వుతున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, అక్క‌డి ఉన్న‌త అధికారులు కానీ, జైలు బాధ్యులు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌క పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు ఎంపీ. అయితే ఎందుకు మౌనంగా ఉన్నార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌న్నారు. విచిత్రం ఏమిటంటే తన తండ్రి బతికే ఉన్నాడని రుజువు కావాలని తన కొడుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా సందేశం పోస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ప్ర‌స్తుతం తాను ఎంపీగా మాట్లాడ‌టం లేద‌ని, భారతదేశపు సాధారణ పౌరుడిగా మాత్రమే మాట్లాడుతున్నాన‌ని పేర్కొన్నారు. అది పాకిస్తాన్ అంతర్గత వ్యవహారం. కానీ ఒక మానవుడు ప్రమాదంలో ఉన్నాడు. ఆ పెద్దమనిషికి ఏమి జరిగిందో తెలుసు కోవాలనుకునే క్రికెట్ అభిమానులు ఎక్కువ‌గా ఉన్నార‌నేది గ్ర‌హించాల‌న్నారు.

Exit mobile version