Shanghai Summit : చైనా – చైనాలోని టియాంజిన్ లో జరుగుతున్న షాంగై ఆర్థిక సదస్సు (Shanghai Summit) ముక్త కంఠంతో ఖండించింది భారత దేశంలోని జమ్మూ కాశ్మీర్ లో పెహల్గామ్ దాడి ఘటనను. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది. దీనిని ప్రతి ఒక్కరం ఖండిస్తున్నామని ఆయా దేశాల ప్రతినిధులు ప్రకటించారు. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా భారత దేశానికి, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఇది ఆహ్వానించ దగిన పరిణామం. పహల్గామ్ దాడి ఘటనపై తీవ్రంగా స్పందించింది ఇండియా. ఆపరేషన్ సిందూర్ ను ప్రయోగించింది. పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. చివరకు కాళ్ల బేరానికి వచ్చేలా చేయడంతో గత్యంతరం లేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకున్నారు. యుద్దం ఇరు దేశాలకు మంచిది కాదంటూ పేర్కొన్నారు. ఆయన జోక్యంతో మోదీ తగ్గారు. చివరకు యుద్దాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Shanghai Summit Condemns Pahalgam Attack
ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ సందర్బంగా ఆయా దేశాలు ప్రత్యేకంగా కీలక అంశాల గురించి ప్రస్తావించాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోద యోగ్యం కాదనే భారతదేశం వైఖరితో ఏకీభవించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా వ్లాదిమిర్ పుతిన్ తో పాటు అనేక ఇతర ప్రపంచ నాయకులు హాజరైన చైనా ఓడరేవు నగరంలో జరిగిన రెండు రోజుల వార్షిక శిఖరాగ్ర సమావేశం ముగింపు రోజున దీనిపై చర్చ జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే దాని బలమైన సంకల్పాన్ని ప్రభావవంతమైన సమూహం పేర్కొంది. ఇదే సమయంలో గాజాలో ఇజ్రాయెల్ చేసిన సైనిక దాడులను సాంఘై సదస్సు ఖండించింది.
Also Read : Supreme Court Shocking TG High Court : స్థానికత అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
