Shami : ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ భార్య హసిన్ జహాన్. కాంట్రాక్ట్ కిల్లర్ తో తనను చంపించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని వాపోయారు. విచిత్రం ఏమిటంటే షమీ మరోసారి సంచలనంగా మారారు. విచిత్రం ఏమిటంటే క్రీడా మైదానంలో ప్రదర్శనతో కాదు. తను మొదటి భార్య హసిన్ జహాన్ తో విడి పోయాడు. వీరిద్దరికి సంబంధించిన కేసు విచారణ జరిగింది కోల్ కతా కోర్టులో. సుదీర్ఘ విచారణ అనంతరం సంచలన తీర్పు వెలువరించింది. ప్రతి నెలా భరణం కింద మహమ్మద్ షమీ (Shami) రూ. 4 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.
Shami Ex Wife Allegations
దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హసిన్ జహాన్. తనతో పాటు కూతురుకు నెలకు రూ. 10 లక్షల చొప్పున భరణం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనిని తోసిపుచ్చింది హైకోర్టు. గొంతెమ్మ కోర్కెలు కోరితే తాము తీర్చలేమని, నిర్దేశించిన భరణం గురించి ఒప్పుకోవాలని స్పష్టం చేసింది. తాజాగా హసిన్ జహాన్ తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో పదునైన పదజాలం వాడారు. ఈ సందర్బంగా క్రికెటర్ షమీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు.
షమీ అనుకున్నంత మంచి వాడు కాదని, తనకు అడ్డంకిగా ఉన్నానని తనను ఈ భూమి మీద నుంచి లేకుండా చేయాలని చూస్తున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన కూతురును కావాలని నిర్లక్ష్యానికి గురి చేశాడని వాపోయింది. పురుషాధిక్య సమాజంలో షమీకి ప్రజల మద్దతు ఉండవచ్చని, కానీ తను చేసిన మోసం త్వరలోనే బట్ట బయలు అవడం ఖాయమని పేర్కొంది. ఆత్మ అనేది ఒకటి ఉంటుందన్నారు.
ఇదిలా ఉండగా షమీ, జహాన్ 2014లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఓ కూతురు ఉంది. ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2018లో జహాన్ షమీపై గృహ హింస కేసు దాఖలు చేశారు, అప్పటి నుండి ఇది చట్టపరమైన పరిశీలనలో ఉంది.
Also Read : AP RDA Approved : అదనపు భూ సేకరణకు ఏపీసీఆర్డీఏ ఆమోదం
