Sensex Nifty Drop : ట్రంప్ సుంకాల మోతతో సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టం

ప్రారంభం నుంచే అమ్మకాలు పెరగడంతో సూచీలు గణనీయమైన నష్టాలను చవిచూశాయి...

Hello Telugu - Sensex Nifty Drop

Hello Telugu - Sensex Nifty Drop

Sensex Nifty : అమెరికా విధించిన సుంకాల ప్రభావం కారణంగా గురువారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ప్రారంభం నుంచే అమ్మకాలు పెరగడంతో సూచీలు గణనీయమైన నష్టాలను చవిచూశాయి.

నిఫ్టీ 180 పాయింట్లు పడిపోతూ 24,583 వద్ద కొనసాగగా, బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 600 పాయింట్లు నష్టపోయి 80,315 వద్ద ట్రేడవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన 16 రంగాల్లో 14 రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. స్మాల్ క్యాప్ 0.2 శాతం, మిడ్ క్యాప్ 0.1 శాతం మేర తగ్గాయి. అంతర్జాతీయ కరెన్సీ మారకంలో రూపాయి విలువ 87.50 వద్ద కదలాడుతోంది.

మంగళవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ఒకే రోజులో 1 శాతం మేర పతనమవడం గత మూడు నెలల్లో ఇదే తొలిసారి. బుధవారం సెలవు కారణంగా గురువారం ప్రారంభం నుంచే ఒత్తిడి మరింతగా కనిపించింది.

Sensex Nifty  – నష్టాలకు కారణం

మార్కెట్ నిపుణుల ప్రకారం, అమెరికా సుంకాల ఎఫెక్ట్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనివల్ల విదేశీ పెట్టుబడులు తగ్గడం, లాభాల కోతలు, ట్రేడర్లలో ఆందోళన వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. సుంకాల అంశంలో ఇరు దేశాలు మధ్యస్థ మార్గం అనుసరించే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటివరకు మార్కెట్లో స్వల్పకాలిక ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Also Read : Indian Economy Interesting : 2038 వ సంవత్సరానికి ప్రపంచంలో 2వ ఆర్థిక వ్యవస్థగా భారత్

Exit mobile version