Rave Party Sensational : రేవ్ పార్టీ క‌ల‌కం భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం

తొమ్మిది మంది అరెస్ట్ చేసిన పోలీసులు

Hello Telugu - Rave Party Sensational

Hello Telugu - Rave Party Sensational

Rave Party : హైద‌రాబాద్ – హైద‌రాబాద్ లోని కొండాపూర్ లో జ‌రిగిన రేవ్ పార్టీని భ‌గ్నం చేశారు పోలీసులు. పెద్ద ఎత్తున మాద‌క ద్ర‌వ్యాల‌ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో భాగం పంచుకున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న కొండాపూర్​లోని సర్వీస్​ అపార్ట్​మెంట్​లో చోటు చేసుకుంది. వీరితో పాటు వీరికి చెందిన ఆరు కార్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేశారు.

Rave Party in Hyderabad – Drugs Seized

స్టేట్​ ఎక్సైజ్​ ఎస్​టీఎఫ్​(స్టేట్​ టాస్క్​ ఫోర్స్​) టీం రేవ్ పార్టీని (Rave Party) భ‌గ్నం చేసింది. కొండాపూర్​ ప్రాంతంలో వీకెండ్​లలో సర్వీస్​ అపార్ట్​మెంట్లలో మద్యం విందు, డ్రగ్స్​ వినియోగం, అమ్మాయిలతో డాన్సులతో చిత్ర విచిత్రమైన పార్టీలు జరుగుతున్నాయని ప‌క్కా స‌మాచారం పోలీసుల‌కు అందింది. ఈ దాడుల‌ను సీఐ సంధ్య ఆధ్వర్యంలో ఎస్​టీఎఫ్​ టీం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్​కు చెందిన కొన్ని ముఠాలుగా ఏర్ప‌డి వీకెండ్​లలో ఇక్కడికి తీసుకు వస్తారు.

విజయవాడకు చెందిన నాయుడు అలియాస్​ వాసు, శివం, రాయుడు అనే వ్యక్తులు నకిలీ బ్యాంక్​ అకౌంట్లు, నకిలీ ఆధార్​ కార్డులతో ధనవంతులను ఆకర్షిస్తున్న‌ట్లు సంధ్య చెప్పారు. గ‌త కొంత కాలంగా ఈ త‌తంగం కొన‌సాగుతోంద‌న్నారు. కాగా త‌ప్పించుకున్న వారిలో రాహుల్​, ఆర్గనైజర్​ ప్రవీణ్​కుమార్​ అలియాస్​ మన్నే, ఆర్గనైజర్​ అప్పికోట్ల అశోక్​కుమార్​, సమ్మెల సాయి కృష్ణతో పాటు పలువురు ఉన్నారని ప్ర‌క‌టించారు సంధ్య‌. 11 మందిపై కేసు న‌మోదు చేశామ‌న్నారు. 2 కేజీల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల ముష్రూమ్, 1.91 గ్రాముల చ‌ర‌స్ డ్ర‌గ్స్ , 11 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.

Also Read : DGCA Fired on Air India : ఎయిర్ ఇండియా వైఫ‌ల్యం డీజీసీఏ ఆగ్ర‌హం

Exit mobile version