గుంటూరు జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలనంగా మారారు. ఆయన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. దీనికి కారణంగా ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన వర్క్ షాప్ కు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఆయన సీఎం , పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో హాజరైనప్పటికీ తను కూడా కేవలం సామాన్య కార్యకర్తగా భావించి అందరి మధ్యలోనే కూర్చున్నారు. సింప్లిసిటీకి తాను నిదర్శనమని చెప్పకనే చెప్పారు.
25 పార్లమెంట్ కమిటీల నుంచి 1050 మంది కమిటీ సభ్యులు వర్క్ షాప్‌కు హాజరయ్యారు. నాలుగున్నర దశాబ్దాల పార్టీ ప్రయాణం, పార్టీ ఐడియాలజీ, క్యాడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు ప్రాధాన్యం వంటి అంశాలను ఈ సందర్బంగా వివరించారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు. సాధారణ కార్యకర్తలా సమావేశ మందిరంలో చివర్లో కూర్చున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు . ఈ వర్క్ షాప్‌లో టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావుతో పాటు మంత్రులు, కీలక నేతలు, సీనియర్ కార్యకర్తలు, వివిధ విభాగాలకు చెందిన బాధ్యులు పాలు పంచుకున్నారు.
ఈ సందర్బంగా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పార్టీలో కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని, ఇందు కోసం శ్రమించాలని కోరారు. భారత దేశంలో తెలుగుదేశం పార్టీ ఓ ప్రభంజనం సృష్టించిందని చెప్పారు. ఎక్కడా ఏ పార్టీకి లేనంతటి క్యాడర్ టీడీపీకి ఉందన్నారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు లోకేష్.

















