Srirangam : తిరుమల – ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీరంగం (Srirangam) శ్రీ రంగనాథ స్వామి ఆలయం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు, తమిళనాడు దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీధరన్ కలిసి పట్టువస్త్రాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Srirangam Sare to Tirumala
ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ అదనపు కార్యదర్శి మణివాసగం, శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శివరామ్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సుందర బట్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె. శ్యామల రావు కీలక ప్రకటన చేశారు. వచ్చే అక్టోబర్ నెలలో దర్శనానికి సంబంధించి టోకెన్ల కోటాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి ప్రారంభం అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని శ్రీవారి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని కోరారు. మధ్య దళారీలను నమ్మవద్దని హెచ్చరించారు.
Also Read : శోభాయమానంగా పుష్ప పల్లకీ సేవ
