సంజు శాంస‌న్ ఆట తీరు కోట్లాది మందికి స్పూర్తి

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్

hellotelugu-Mohanlal

కేర‌ళ : ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్నందుకు అభినంద‌న‌లు తెలిపాడు. సోమ‌వారం ఎక్స్ వేదిక‌గా న‌టుడు స్పందించాడు. ప్ర‌త్యేకించి ఈ టోర్నీలో భారత జ‌ట్టుకు వెన్నుద‌న్నుగా ఉంటూ ముఖ్య‌మైన మ్యాచ్ ల‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసి చివ‌ర‌కు టోర్నీలోనే టాప్ ప్లేయ‌ర్ గా అవార్డు అందుకున్న సంజు శాంస‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు మోహ‌న్ లాల్. ఇవాళ త‌న‌ను చూసి కేర‌ళ జాతి గ‌ర్వ ప‌డుతోంద‌ని పేర్కొన్నాడు. త‌ను ఎన్నో అవ‌మానాలు, మ‌రెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడ‌ని, కానీ అవ‌న్నీ త‌న ఆట తీరుతో మాసి పోయాయ‌ని అన్నాడు.

ఇలాంటి ఆట‌గాడు త‌మ ప్రాంతానికి చెందిన వాడై ఉండ‌డం త‌మ‌కు ఎంతో గ‌ర్వంగా ఉంద‌న్నాడు మోహ‌న్ లాల్. అద్భుత‌మైన షాట్స్, క‌ళ్లు చెదిరేలా ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన విధానం త‌న‌ను ఇప్ప‌టికీ మెస్మ‌రైజ్ చేస్తూనే ఉంద‌న్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్ లు మ‌రెన్నో ఆడాల‌ని, కేర‌ళ‌కు, భార‌త దేశానికి మ‌రింత పేరు తీసుకు రావాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు మోహ‌న్ లాల్. ఎల్ల‌ప్ప‌టికీ త‌న ఆట , త‌న జీవితం స్పూర్తి ని క‌లిగిస్తూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు. క‌ష్ట‌ప‌డితే, త‌న‌ను తాను న‌మ్ముకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చ‌ని సంజు శాంస‌న్ నిరూపించాడ‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు .

Exit mobile version