చెన్నై : చెన్నై సూపర్ కింగ్స్ టీం లో కీలకమైన ఆటగాడిగా మారిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను గతంలో పలు జట్ల తరపున ఆడాడు. కానీ ఎక్కువ కాలం రాజస్థాన్ రాయల్స్ కు ఆడాడు. ఆ జట్టును సెమీ ఫైనల్ దాకా తీసుకు వెళ్లాడు. కానీ అనుకోని రీతిలో శాంసన్ ఆ జట్టును వీడాడు. ఏకంగా సీఎస్కే యాజమాన్యం సంజు శాంసన్ ను రూ. 18 కోట్లకు తీసుకుంది. తమ జట్టు తరపున శామ్ కరన్ , రవీంద్ర జడేజాలను వదులుకుంది. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు సీఎస్కే తరపున రెండు సెంచరీలు చేశాడు.
తాజాగా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి స్పందించాడు. తన ‘కల నిజమైన’ క్షణాన్ని పంచుకున్నాడు. ఒకసారి నాకు ఒక కల వచ్చింది. అందులో ధోనీ భాయ్ కెప్టెన్‌గా ఉండి ఫీల్డింగ్ సిద్ధం చేస్తున్నారు. నేను స్లిప్‌లో నిలబడి ఉన్నాను, అప్పుడు ఆయన నాతో, “సంజు, అక్కడికి వెళ్ళు” అన్నారు. నేను నా స్థానానికి పరుగెత్తుకెళ్లి తర్వాతి బంతి కోసం సిద్ధమయ్యాను.కొన్ని రోజుల తర్వాత, ఆయన కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారని విన్నాను. ముఖ్యంగా నీలిరంగు జెర్సీలో నా కల ఎలా నిజమవుతుందో అని ఆశ్చర్యపోయాను.
కానీ కొన్ని వారాల తర్వాత, ముంబైలో జరిగిన ఇండియా ‘ఎ’ మ్యాచ్‌లో ఆయన మళ్లీ కెప్టెన్సీ చేశారు. నేను స్లిప్‌లో ఉన్నాను, ఆయన, “సంజు, అక్కడికి వెళ్ళు” అన్నారు, నేను నా కలలో లాగే పరుగెత్తాను. చివరికి, అది నిజమైంది. అని అన్నాడు.



















