చెన్నై : మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టు ఎంపికపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రధానంగా గత కొంత కాలంగా పేలవమైన ఆటతీరుతో జట్టుకు భారంగా మారి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న శుభ్ మన్ గిల్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇదే సమయంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. తనను స్వంత సోదరుడంటూ పేర్కొన్నాడు. తన సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడాడు రవిచంద్రన్ అశ్విన్. తను ఇచ్చిన తోడ్పాటు, సహకారంతో తను ఇంత కాలం నెట్టుకు వచ్చానని చెప్పాడు. అంతే కాదు ఆ జట్టును ఐపీఎల్ ఫైనల్ వరకు తీసుకు వచ్చిన ఘనత శాంసన్ కే దక్కుతుందన్నాడు.
ఇదిలా ఉండగా ఈసారి ఊహించని ధరకు అమ్ముడు పోయాడు తను. సంజూ శాంసన్ ను ఏరికోరి ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. తన స్థానాన్ని భర్తీ చేసే దమ్మున్న ఆటగాడు ఒకే ఒక్కడు కేరళ స్టార్ క్రికెటరేనని చివరకు డిసైడ్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ. తమిళనాడులో అత్యంత జనాదరణ కలిగిన ఆటగాడిగా ఇప్పటి వరకు టాప్ లో కొనసాగుతున్నాడు జార్ఖండ్ డైనమెట్. తనను వారి స్వంత కొడుకులాగా భావిస్తారు తంబీలంతా. ఈసారి ఐపీఎల్ ట్రేడింగ్ లో భారీ ధరకు సంజూ శాంసన్ ను తీసుకుంది సీఎస్కే ధోనీ సిఫారసుతో. తన కోసం ఇద్దరు స్టార్ ప్లేయర్లను వదులుకుంది. వారిలో రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరన్ ఉన్నారు. అయినా ధోనీ పట్టుపట్టి శాంసన్ ను ఎంచుకున్నాడు. ఇక అశ్విన్ మాట్లాడుతూ శాంసన్ ఎంపిక అనివార్యంగా మారిందని అన్నాడు. ఓ వైపు గిల్ పూర్ పర్ ఫార్మెన్స్ తో తీవ్ర ఒత్తిడికి హెడ్ కోచ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ గురయ్యారని పేర్కొన్నాడు. తన తంబి (తమ్ముడు) వరల్డ్ కప్ లో దుమ్ము రేపడం ఖాయమని జోష్యం చెప్పాడు.
